Bank Holidays : డిసెంబర్‌ నెలలో బ్యాంకుల సెలవుల వివరాలు..

2021 డిసెంబర్ నెలలో బ్యాంకులకు సెలవులు ఎన్నున్నాయో తెలుసుకోండి..బ్యాంకు లావాదేవీలు ఏమన్నా ఉంటే వెంటనే చేసుకోవటానికి ఈ విషయం తెలుసుకోండి..

Bank Holidays : డిసెంబర్‌ నెలలో బ్యాంకుల సెలవుల వివరాలు..

Bank Holidays In December

Bank Holidays in December : 2021 డిసెంబర్ నెలలో బ్యాంకులకు సెలవులు ఎన్నున్నాయో తెలుసుకోండి..బ్యాంకు లావాదేవీలు ఏమన్నా ఉంటే వెంటనే చేసుకోవటానికి ఈ విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. డిసెంబర్‌లో ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలు జరపాలనుకుంటే బ్యాంకులకు ఉన్న సెలవుల వివరాలు తెలుసుకోవాలి కదా మరి. ఈ ఏడాదికి ఆర్థిక లావాదేవీలు పూర్తి చేయాలి అనుకునేవారు డిసెంబర్ లో బ్యాంకు సెలవులను బట్టి ప్లాన్ చేసుకోవల్సిన అవసరం ఉంది.

డిసెంబర్ 5న ఆదివారం సందర్భంగా సెలవు. డిసెంబర్ 11న రెండో శనివారం, డిసెంబర్ 12న ఆదివారం రావడంతో వరుసగా రెండు రోజులు సెలవులు వచ్చాయి. డిసెంబర్ 19న ఆదివారం వల్ల మరో సెలవు. డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ సెలవు. నాలుగో శనివారం కలిపి వచ్చాయి. మరుసటి రోజు డిసెంబర్ 26న ఆదివారం కావడంతో వరుసగా రెండు రోజులు బ్యాంకులు తెరుచుకోవు.

డిసెంబర్‌లో క్రిస్మస్ సెలవు మాత్రమే వచ్చింది. ఆ సెలవు కూడా నాలుగో శనివారంతో కలిసిపోయింది. దీంతో బ్యాంకులకు ప్రతీ నెలా సాధారణంగా ఉండే 6 సెలవులు మాత్రమే ఉన్నాయి. నాలుగు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం మాత్రమే బ్యాంకులు తెరుచుకోవు.

ఇక ఇతర రాష్ట్రాల్లో డిసెంబర్ 3న సెయింట్ ఫ్రాన్సిస్ సేవియర్ ఫీస్ట్. డిసెంబర్ 18న యు సోసో థామ్ వర్ధంతి. డిసెంబర్ 24న, డిసెంబర్ 27న క్రిస్మస్ సంబరాలు. డిసెంబర్ 30న యు కియాంగ్ నాన్గ్‌బాహ్, డిసెంబర్ 31న కొత్త సంవత్స వేడుకల సందర్భంగా సెలవులు ఉన్నాయి. ఈ సెలవులేవీ తెలుగు రాష్ట్రాలకు వర్తించవని గమనించాలి.

కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్‌లో బ్యాంకులకు 6 రోజులు మాత్రమే సెలవులు ఉన్నాయి. బ్యాంకులకు సెలవులు ఉన్న రోజు ఖాతాదారులు నేషనల్ ఎలక్ట్రానిక్స్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ , రియల్‌టైమ్ గ్రాస్ సెటిల్మెంట్, యూపీఐ, ఆన్‌లైన్ బ్యాంకింగ్ లాంటి సేవల్ని ఉపయోగించుకోవచ్చనే విషయం గమనించాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI అధికారిక వెబ్‌సైట్‌లో బ్యాంకుల సెలవుల వివరాలు పొందుపరిచారు.

బ్యాంకులకు ఎప్పుడెప్పుడు హాలిడేస్ ఉన్నాయో వివరాలు ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఈ వివరాలు తెలుసుకోవాలంటే..https://www.rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx లింక్ క్లిక్ చేస్తే రాష్ట్రాల వారీగా సెలవుల వివరాలు ఉంటాయి. అలాగే తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో బ్యాంక్ హాలిడేస్ వివరాలు తెలుసుకోవడానికి హైదరాబాద్ సర్కిల్ సెలెక్ట్ చేయాలి.