బాలయ్యతో ఖిలాడి ‘ఢీ’..

బాలయ్యతో ఖిలాడి ‘ఢీ’..

BB 3 – Khiladi: గత మూడు రోజులుగా వరుస అప్‌డేట్స్‌తో టాలీవుడ్ కళకళలాడిపోయింది. మేకర్స్ తమ కొత్త సినిమాల తాలూకు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తూ.. ఇండస్ట్రీ వర్గాల్లో, ప్రేక్షకాభిమానులలో కొత్త ఉత్సాహాన్ని నింపారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలా చిత్రాలు విడుదల తేదీలు ఫిక్స్ చేసుకున్నాయి.

https://10tv.in/bb-3-roar-in-theatres-from-28th-may-2021/

చాలా వరకు సినిమాకి సినిమాకి మధ్య వారం రోజుల గ్యాప్ ఉండేలా చూసుకున్నారు. ‘ఆచార్య’ మే 13, ‘నారప్ప’ మే 14న ఒకరోజు తేడాతో రిలీజ్ అవుతున్నాయి. అయితే ఒకే తేదీన రెండు సినిమాలు వస్తున్నట్టు ఎవరూ ప్రకటించలేదు.

https://10tv.in/raviteja-khiladi-movie-to-release-this-summer/

బాలయ్య – బోయపాటి సినిమా మే 28న రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. అదే రోజు రవితేజ ‘ఖిలాడి’ కూడా విడుదలవుతోంది. రెండు సినిమాలు ఒకటే రోజు బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాయి. మే 28 అంటే ఎన్టీఆర్ జయంతి కాబట్టి బాలయ్య డేట్ మార్చే ప్రయత్నం చెయ్యరు. మరి ‘ఖిలాడి’ డేట్ ఏమైనా మారుస్తారా లేక అదే రోజు వదులుతారా అనే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది ఫిలింవర్గాల్లో..

Okka Magaadu

ఇంతకుముదు 2008 సంక్రాంతికి ‘ఒక్కమగాడు’ (జనవరి 10), ‘కృష్ణ’ (జనవరి 11) ఒక్కరోజు తేడాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.. బాలయ్య మూవీ భారీ డిజాస్టర్ కాగా రవితేజ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఇద్దరు హీరోల సినిమాలు ఒకేరోజు రిలీజ్ అవుతుండడంతో ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి నెలకొంది.

Krishna