YS Viveka Murder Case: వివేకా హత్య నిందితుల బెయిల్ పిటిషన్.. విచారణ ఎల్లుండికి వాయిదా
వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుల బెయిల్ పిటిషన్‌పై బుధవారం ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. బెయిల్ పిటిషన్లో సీబీఐతోపాటు ప్రతివాదిగా ఉన్న వివేకా కుమార్తె సునీత కూడా కోర్టుకు హాజరయ్యారు.

YS Viveka Murder Case: వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుల బెయిల్ పిటిషన్‌పై బుధవారం ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. బెయిల్ పిటిషన్లో సీబీఐతోపాటు ప్రతివాదిగా ఉన్న వివేకా కుమార్తె సునీత కూడా కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ నిందితుల బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగుతోందని చెప్పారు. సీబీఐతోపాటు, సునీత తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఈ కేసులో ఏ1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి ఇప్పటికే బెయిల్ మీద ఉన్నారు. ఏ2గా ఉన్న వై.సునీల్ యాదవ్, ఏ3గా ఉన్న ఉమా శంకర్ రెడ్డి, ఏ5గా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ కోసం ఈ విచారణ కొనసాగుతోంది. నిందితుల నుంచి ఇప్పటికే వాంగ్మూలాలు సేకరించారని, వారికి ఎటువంటి ప్రాణహాని లేదని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
YS Viveka Reddy : వివేకా హత్య కేసులో సంచలన విషయాలు
అందువల్ల నిందితులకు బెయిల్ మంజూరు చేయాలని ఏ5గా ఉన్న శివ శంకర్ రెడ్డి తరఫు న్యాయవాదులు కోరారు. అయితే, ఈ అంశంలో తమ వాదనలు కూడా వినాలని ఇంప్లీడ్ దాఖలు చేశామని సునీత తరఫు న్యాయవాదులు తెలిపారు. మృతుడి కుమార్తె కాబట్టి, సునీతకు కూడా ఇంప్లీడ్ అయ్యేందుకు అర్హత ఉందని ఆమె తరఫు న్యాయవాదులు వాదించారు. గతంలో శివశంకర్ రెడ్డి పిటిషన్ న్యాయమూర్తి కొట్టేశారని, ప్రస్తుతం వ్యాజ్యం కూడా ఆ కోర్టు విచారణకే వెళ్లాలని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. శివ శంకర్ రెడ్డి తరఫు వాదనలు విన్న ధర్మాసనం కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు ఎల్లుండి వింటామని చెప్పింది.
- Andhra Pradesh: నేడు వర్షం అడ్డు రాకపోతే గుడివాడ గడగడలాడేది: కొల్లు రవీంద్ర
- Andhra Pradesh: 5 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం.. వారంలో ఒక రోజు ‘నో బ్యాగ్ డే’
- Bypoll Results: ఉప ఎన్నికల ఫలితాలు.. ఏ స్థానంలో ఎవరు గెలిచారు?
- East Godavari: సెల్ఫీలు దిగుతూ గోదావరి నదిలో పడ్డ అక్కాచెల్లెళ్లు.. మృతి
- Konaseema District : అంబేద్కర్ కోనసీమ జిల్లాకే ఏపీ కేబినెట్ ఆమోదం
1Cervical Spondylosis: సర్వికల్ స్పాండిలోసిస్ కోసం 5 యోగాసనాలు
2Rains : తెలంగాణలో నాలుగు రోజులపాటు వర్షాలు
3Telangana : తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల
4TET Final Key : తెలంగాణ TET ఫైనల్ ‘కీ’ రిలీజ్
5Tirupati : నలుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
6Drugs : ఢిల్లీ-టూ-హైదరాబాద్ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు
7Maharashtra: శివసేనకు షాక్.. రేపు మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పు
8Twitter Accounts : ట్విటర్‌కు గట్టి షాకిచ్చిన కేంద్రం.. జూలై 4 వరకే డెడ్‌లైన్!
9Hyderabad : ఆసియా-పసిఫిక్ స్థిరమైన నగరాల్లో టాప్ 20లో హైదరాబాద్
10Ram Pothineni: తమిళ డైరెక్టర్స్‌కే రామ్ ప్రిఫరెన్స్..?
-
Rajamouli: మహేష్, జక్కన్న లెక్క మూడు!
-
Madhya Pradesh : మద్యం మత్తులో మహిళకు నిప్పంటించిన నలుగురు వ్యక్తులు
-
IPL Tournament : గుడ్‌న్యూస్.. ఐపీఎల్ ఇకపై రెండున్నర నెలలు.. ఫ్యాన్స్‌కు పండుగే..!
-
NTR: అభిమానికి తారక్ ధీమా.. ఫిదా అవుతున్న నెటిజన్లు!
-
Actress Swara Bhaskar : చంపేస్తామని నటి స్వర భాస్కర్‌కు బెదిరింపు లేఖ
-
Samantha: యశోద.. ఆ రోజున రాదా..?
-
KA Paul : కేసీఆర్, మోదీ ఇద్దరూ తోడు దొంగలే : కేఏ.పాల్
-
Konchem Hatke: ‘కొంచెం హట్కే’గా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్!