YS Viveka Reddy : వివేకా హత్య కేసులో సంచలన విషయాలు

పులివెందుల కోర్టులో నిన్న నలుగురు నిందితులకు సంబంధించి అభియోగ పత్రాలు, ఫిర్యాదులను కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అధికారులు సంబంధిత న్యాయవాదులకు అందజేశారు.

YS Viveka Reddy : వివేకా హత్య కేసులో సంచలన విషయాలు

Viveka (1)

YS Vivekananda Reddy : మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్యకేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరి సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదు వివరాలు బయటికొచ్చాయి. పులివెందుల కోర్టులో నిన్న నలుగురు నిందితులకు సంబంధించి అభియోగ పత్రాలు, ఫిర్యాదులను కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అధికారులు సంబంధిత న్యాయవాదులకు అందజేశారు. అందులో భాగంగా దస్తగిరి సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదు బయటకు రావడం చర్చనీయాంశమైంది.

గతేడాది ఆగస్టు 31న ప్రొద్దుటూరు కోర్టులో సెక్షన్‌ 164 కింద దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు. ఆ తర్వాత.. సీబీఐకి ఎలాంటి వివరాలు తెలియజేయకుండా మభ్య పెట్టేవిధంగా, లొంగదీసుకునేందుకు కొందరు అతన్ని సంప్రదించినట్టు ఫిర్యాదు రూపంలో సెప్టెంబరు 30న సీబీఐకి దస్తగిరి అందజేశాడు. అందులో ప్రధానంగా పులివెందులకు చెందిన భరత్‌ యాదవ్‌ తరచూ తన ఇంటికి వచ్చే వాడని, సీబీఐకి ఎలాంటి వివరాలు చెప్పావు, ఏం స్టేట్‌మెంట్‌ ఇచ్చావు.. ఆ వివరాలన్నీ చెప్పాలని వేధిస్తున్నాడని ఫిర్యాదులో తెలిపాడు దస్తగిరి.

Sajjala : వివేకా హత్య కేసు.. సీబీఐ ఛార్జిషీట్‌లో కుట్ర ఉంది-సజ్జల సంచలనం

కేసుకు సంబంధించిన విషయాలు ఎక్కడా చెప్పవద్దని.. అందుకోసం ఎంతైనా ఇస్తామంటూ తనకు ఆఫర్‌ చేశారంటూ దస్తగిరి లేఖలో పేర్కొన్నారు. భరత్‌ యాదవ్‌, అతనితో పాటు ఓ న్యాయవాది కలిసి.. 20 ఎకరాల భూమి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామంటూ తనతో చెప్పారని దస్తగిరి అంటున్నాడు. భరత్‌ యాదవ్‌ తనపై నిఘాపెట్టి ఫాలో అవుతున్నాడని దస్తగిరి పేర్కొనడంతో ఈ కేసు ఇప్పుడు మరింత కీలకంగా మారింది.