YS Viveka : వైఎస్ వివేకా హత్య కేసు.. అందులో నిజం లేదన్న దస్తగిరి

డబ్బు కోసం అప్రూవర్ గా మారానని వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని తేల్చి చెప్పాడు. నాకు ఎవరు డబ్బులు ఇవ్వలేదని దస్తగిరి తెలిపాడు.

YS Viveka : వైఎస్ వివేకా హత్య కేసు.. అందులో నిజం లేదన్న దస్తగిరి

Ys Viveka

YS Viveka : ఏపీలో సంచలనం రేపిన మాజీమంత్రి, సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు, వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి కీలక వ్యాఖ్యలు చేశాడు. దస్తగరి ఇదివరకే ఈ కేసులో అప్రూవర్ గా మారిన సంగతి తెలిసిందే. వివేకా హత్య కేసులో దస్తగిరి తాజా వాంగ్మూలం తీవ్ర కలకలం రేపుతోంది. దీనిపై దస్తగిరి మాట్లాడుతూ, రెండో వాంగ్మూలం తర్వాత తనకు భద్రత కావాలనిపిస్తోందని అన్నాడు.

తన కుటుంబం కోసమే వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారానని దస్తగిరి తెలిపాడు. డబ్బు కోసం అప్రూవర్ గా మారానని వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని తేల్చి చెప్పాడు. నాకు ఎవరూ డబ్బులు ఇవ్వలేదన్నాడు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే తనకు ప్రాణభయం ఉన్నట్టు తెలుస్తోందని ఆందోళన వ్యక్తం చేశాడు. నాకు, నా కుటుంబానికి ప్రాణహాని ఉందని వాపోయాడు. ఇప్పటికే ఈ విషయమై జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశానని.. తనకు రక్షణ కల్పించాలని ఎస్పీని, సీబీఐ అధికారులను కోరానని తెలిపాడు. తాను ఎవరి ఒత్తిడితోనూ అప్రూవర్ గా మారలేదని, అప్రూవర్ గా మారడంలో తనపై ఇతరుల ప్రలోభాలు లేవని దస్తగరి స్పష్టం చేశాడు.

Sajjala : ఆధారాలు లేకుండా ఆరోపణలు కరెక్ట్ కాదు-సజ్జల

వివేకా హ‌త్య కేసు ద‌ర్యాప్తులో మంగ‌ళ‌వారం వ‌రుస ట్విస్టులు చోటుచేసుకున్నాయి. వివేకా దగ్గర కారు డ్రైవ‌ర్‌గా ప‌నిచేసిన ద‌స్త‌గిరి రెండో ద‌ఫా త‌న వాంగ్మూలాన్ని ఇవ్వ‌గా.. ఈ కేసును ద‌ర్యాప్తు చేస్తున్న సీబీఐ బృందంలోని అధికారి రాంసింగ్‌పై ఏకంగా కేసు న‌మోదైంది.

YS Vivekananda Reddy Murder Case, Viveka Ex Driver Dastagiri Key Comments

YS Vivekananda Reddy Murder Case, Viveka Ex Driver Dastagiri Key Comments

విచారణ పేరుతో సీబీఐ అధికారి రామ్‌సింగ్‌ వేధిస్తున్నారని కడప జిల్లా కోర్టులో పులివెందులకు చెందిన ఉదయ్‌ కుమార్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు కడప రిమ్స్‌ పోలీసులు సీబీఐ అధికారి రామ్‌సింగ్‌పై కేసు నమోదు చేశారు.

YS Viveka : వైఎస్ వివేకా హత్య కేసు.. మళ్లీ మొదలైన సీబీఐ విచారణ

‘‘వివేకా హత్యకేసుకు సంబంధించి సీబీఐ అధికారులు మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారు. వారు చెప్పినట్టు చెప్పకపోతే కుటుంబం మొత్తాన్ని కేసులో ఇరికిస్తాని బెదిరిస్తున్నారు. ఆఫీసులో, ఇంటి దగ్గర అవమానించారు’’ అని పులివెందుల వాసి, యురేనియం కార్పొరేషన్‌ ఉద్యోగి ఉదయ్‌కుమార్‌రెడ్డి ఇటీవల జిల్లా పోలీసు కార్యాయలంలో ఏఆర్‌ అదనపు ఎస్పీని కలిసి వినతిపత్రం ఇచ్చారు. వివేకా హత్యకేసు దర్యాప్తు కీలక దశకు చేరుకున్న తరుణంలో సీబీఐ అధికారిపైనే కేసు నమోదు కావడం హాట్ టాపిక్ గా మారింది.