YS Viveka : వైఎస్ వివేకా హత్య కేసు.. మళ్లీ మొదలైన సీబీఐ విచారణ

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ మళ్లీ మొదలైంది. పులివెందుల ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో సీబీఐ విచారణ చేపట్టింది.

YS Viveka : వైఎస్ వివేకా హత్య కేసు.. మళ్లీ మొదలైన సీబీఐ విచారణ

Ys Vivekananda Reddy Murder Case

YS Viveka : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ మళ్లీ మొదలైంది. కడప జిల్లా పులివెందుల ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో సీబీఐ విచారణ చేపట్టింది. సీబీఐ విచారణకు ముగ్గురు అనుమానితులు హాజరయ్యారు.

గతంలో కడప జిల్లా సాక్షి బ్యూరోగా పని చేసి, ప్రస్తుతం నెల్లూరు బ్యూరోగా పని చేస్తున్న బాలకృష్ణారెడ్డిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. వివేకా గుండెపోటుతో చనిపోయారని బాలకృష్ణారెడ్డికి ఫోన్ చేసి చెప్పారు శివశంకర్ రెడ్డి. వివేకా హత్య కేసులో శివశంకర్ రెడ్డి నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే బాలకృష్ణారెడ్డిని సీబీఐ అధికారులు పలుమార్లు ప్రశ్నించారు.

Drinking Water : పరగడుపున నీళ్లు తాగితే బోలెడు ప్రయోజనాలు

పులివెందులకు చెందిన యుసిఐల్ ఉద్యోగి (యురేనియం కర్మాగారం) ఉదయ్ కూమార్ రెడ్డిని కూడా సీబీఐ బృందం విచారిస్తోంది. రెండు రోజుల క్రితమే కర్మాగారం వెళ్లిన సీబీఐ అధికారులు ఉదయ్ గురించి ఆరా తీశారు. వివేకా మృతదేహానికి ఉదయ్ తండ్రి ప్రకాశ్ రెడ్డి కుట్లు వేశారని సీబీఐ అభియోగం మోపింది. ఇప్పటికే ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు పలుమార్లు ప్రశ్నించారు.

పులివెందులలోని ఈసీ గంగిరెడ్డి హాస్పిటల్ లో పనిచేస్తున్న డాక్టర్ మధుసూదన్ రెడ్డి కూడా సీబీఐ విచారణకు హాజరయ్యారు.

Vivo New Smartphone: వివో నుంచి T1 5G స్మార్ట్ ఫోన్, ధర, ఫోన్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి?

వైఎస్ వివేకా హత్య కేసు.. ఏపీ రాజకీయాలను కుదేపిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రమైన మాటల యుద్ధం నడిచింది. ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా.. వివేకా మర్డర్ కేసు అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది టీడీపీ.