Vivo New Smartphone: వివో నుంచి T1 5G స్మార్ట్ ఫోన్, ధర, ఫోన్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి?

వివో భారత్ లో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. వివో T1 5G స్మార్ట్ ఫోన్ సేల్స్ సోమవారం నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమయ్యాయి.

Vivo New Smartphone: వివో నుంచి T1 5G స్మార్ట్ ఫోన్, ధర, ఫోన్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి?

Vivo

Vivo New Smartphone: చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో భారత్ లో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. వివో T1 5G స్మార్ట్ ఫోన్ సేల్స్ సోమవారం నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమయ్యాయి. మొత్తం మూడు వేరియంట్లు, రెండు రంగుల్లో లభిస్తున్న ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.15,990గా నిర్ణయించింది వివో సంస్థ. 5జీ సాంకేతికతతో ఇప్పటివరకు విడుదలైన స్మార్ట్ ఫోన్ లలో ఇదే ధర తక్కువ ఫోన్ అని సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లలో మార్కెట్ వాటాను పెంచుకునే దిశగా అడుగులేస్తున్న వివో.. ఈమేరకు ఈ ఏడాది మరిన్ని ఫోన్లను తీసుకురానుంది. ఈ “T1 5G” స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది సంస్థ.

Also read: GVL Narasimaharao: మీ సీఎంతో కనీసం అపాయింట్మెంట్ సాధించండి వైకాపా ఎంపీలపై జీవీఎల్ నరసింహారావు ఫైర్

వివో T1 5G స్మార్ట్ ఫోన్ ప్రత్యేకత:
6.58-అంగుళాల FHD+ LCD డిస్‌ప్లే, 2408×1080 రిజల్యూషన్‌, 120Hz రిఫ్రెష్ రేట్ తో ఈ ఫోన్ డిస్ప్లే అద్భుతంగా ఉంటుంది. 5జీ నెట్వర్క్ సాంకేతికత కలిగిన Qualcomm Snapdragon 695 SoC చిప్ సెట్ ను ఈ ఫోన్ లో అమర్చారు. 5000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌, బ్లూటూత్ 5.1 సౌకర్యం ఇందులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 12 ఆధారపడి Funtouch OS 12.0తో ఈ ఫోన్ పనిచేస్తుంది. ఫోన్ ముందు భాగంలో 16ఎంపీ సెల్ఫీ కెమెరాను, వెనుక 50ఎంపీ+2ఎంపీ+2ఎంపీ ట్రిపుల్ కెమెరా అమర్చారు. అన్ని అత్యాధునిక ఫీచర్స్ తో వస్తున్న ఈ వివో T1 5G స్మార్ట్ ఫోన్ భారత్ లోనే అత్యంత “స్లిమ్” అని వివో సంస్థ పేర్కొంది.

Also read: Schools Reopen: పలు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో తెరుచుకున్న పాఠశాలలు, విద్యార్థులేరి?

ఇక మూడు వేరియంట్లలో లభిస్తున్న ఈ వివో T1 5G స్మార్ట్ ఫోన్ ధరలు గమనిస్తే బేస్ వేరియంట్ 4GB + 128GB స్టోరేజ్ ధర రూ. 15,990 గానూ, 6GB + 128GB వేరియంట్ ధర రూ. 16,990 గానూ, టాప్-ఎండ్ 8GB + 128GB ధర రూ. 19,990 గానూ నిర్ణయించారు. లాంచ్ ఆఫర్స్ కింద HDFC, AxisBank, Citi Bank క్రెడిట్ కార్డులపై డిస్కౌంట్ కూడా అందిస్తున్నారు. సోమవారం నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ సేల్స్ ప్రారంభం అయ్యాయి.

Also read: Pulwama Attack: పుల్వామా ఉగ్ర దాడికి మూడేళ్లు: ప్రధాని మోదీ నివాళి