Pulwama Attack: పుల్వామా ఉగ్ర దాడికి మూడేళ్లు: ప్రధాని మోదీ నివాళి

పుల్వామా ఉగ్రదాడి ఘటనకు నేటితో మూడేళ్లు పూర్తైయ్యాయి. ఉగ్రదాడిలో అమరులైన 40 మంది సైనికులకు ప్రధాని మోదీ సహా దేశ ప్రజలు సోమవారం నివాళి అర్పించారు.

Pulwama Attack: పుల్వామా ఉగ్ర దాడికి మూడేళ్లు: ప్రధాని మోదీ నివాళి

Pulwama

Pulwama Attack: పుల్వామా ఉగ్రదాడి ఘటనకు నేటితో మూడేళ్లు పూర్తైయ్యాయి. ఉగ్రదాడిలో అమరులైన 40 మంది సైనికులకు ప్రధాని మోదీ సహా దేశ ప్రజలు సోమవారం నివాళి అర్పించారు. ఈసందర్భంగా ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ “2019లో ఈ రోజున పుల్వామాలో అమరులైన వారందరికీ నేను నివాళులర్పిస్తున్నాను మరియు మన దేశానికి వారు చేసిన విశిష్ట సేవలను స్మరించుకుంటున్నాను. వారి శౌర్యం మరియు అత్యున్నత త్యాగం ప్రతి భారతీయుడిని బలమైన మరియు సంపన్న దేశం కోసం పని చేయడానికి ప్రేరేపిస్తుంది” అని పేర్కొన్నారు. 2019 ఫిబ్రవరి 14న జమ్మూకాశ్మీర్ లోని పుల్వామాలో సైనిక బలగాలే లక్ష్యంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ జరిపిన బాంబుదాడిలో 40 మంది భారత వీర సైనికులు అమరులయ్యారు.

Also read: Yogi Adityanath: రాహుల్, ప్రియాంక వల్లే కాంగ్రెస్ నాశనం అవుతుంది: యోగి ఆదిత్యనాథ్

జమ్ము నుంచి 78 వాహనాల్లో 2500 మంది సీఆర్పీఎఫ్ బలగాలు శ్రీనగర్ బయలుదేరగా, జాతీయ రహదారి 44 పై జైషే మహ్మద్ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈదాడిలో 76వ బెటాలియన్ కు చెందిన 40 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది అసువులు బాశారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఈదాడికి పాల్పడినట్లు ప్రకటించుకుంది. దీంతో కన్నెర్రజేసిన భారత్..ఉగ్రవాదులు కనీవినీ ఎరుగని రీతిలో ప్రతీకారం తీర్చుకుంది.

Also read: New Zealand: ఆందోళనకారులు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు: న్యూజీలాండ్ ప్రధాని

భారత సైన్యంపై దాడి జరిగిన అనంతరం ఫిబ్రవరి 26 తెల్లవారుజామున..సరిహద్దులు దాటి పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లిన భారత వాయుసేన విమానాలు.. బాలాకోట్‌లోని జైషే మొహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడ్డాయి. ఈ వైమానిక దాడుల్లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఆనాటి నుంచి సరిహద్దుల వెంట ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతూనే ఉంది.

Also read: Ukraine-Russia: బైడెన్ గారూ మీరు ఉక్రెయిన్ రండి: ఉక్రెయిన్ అధ్యక్షుడు