Stock Market: కుప్పకూలిన స్టాక్ మార్కెట్ రూ.లక్షల కోట్ల సంపద ఆవిరి

ఉదయం స్టాక్ మార్కెట్లు తెరిచే సమయానికి 56943 వద్ద ప్రారంభమైన బీఎస్ఈ సెన్సెక్స్.. అరగంట వ్యవధిలోనే 1300 పాయింట్లు నష్టపోయింది.

Stock Market: కుప్పకూలిన స్టాక్ మార్కెట్ రూ.లక్షల కోట్ల సంపద ఆవిరి

Stock

Stock Market: ఉక్రెయిన్ పై రష్యా దాడులు సహా అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులతో సోమవారం ఉదయం భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభం అయ్యాయి. ఉదయం స్టాక్ మార్కెట్లు తెరిచే సమయానికి 56943 వద్ద ప్రారంభమైన బీఎస్ఈ సెన్సెక్స్.. అరగంట వ్యవధిలోనే 1300 పాయింట్లు నష్టపోయింది. 17023 వద్ద ప్రారంభమైన జాతీయ స్టాక్ ఎక్స్చేంజి నిఫ్టీ 380 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్ షేర్లకు నేలబారు చూపులే దిక్కవగా.. ఐసీఐసీఐ బ్యాంకు ఇంట్రాడే కనిష్ట స్థాయికి పడిపోయింది. నిఫ్టీలో M&M, SBI, ITC, L&T మరియు ICICI బ్యాంక్ ప్రధాన నష్టాలలో ఉండగా, ONGC మరియు TCS లాభాలతో ప్రారంభించాయి.

Also read: Ukraine-Russia: బైడెన్ గారూ మీరు ఉక్రెయిన్ రండి: ఉక్రెయిన్ అధ్యక్షుడు

దేశంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన బ్యాంకు మోసాలు, ఇతర కుంభకోణాలు, ఆసియ మార్కెట్ల ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై స్పష్టంగా కనిపించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి కారణంగా గత కొన్ని రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్ఠాలను చవిస్తున్నాయి. లక్షల కోట్ల రూపాయల మదుపర్ల సంపద ఆవిరైపోతుంది. ఈక్రమంలో సోమవారం ఆరంభంలోనే భారీ నష్ఠాలతో మార్కెట్లు ప్రారంభం కావడం ఇన్వెస్టర్లలో మరింత ఆందోళన పెంచుతుంది.

Also read: Farmers in AP: ఏపీలో “పంట బీమా పధకం”తో రైతులకు ఉపయోగంలేదు: రైతు సంఘం