Yogi Adityanath: రాహుల్, ప్రియాంక వల్లే కాంగ్రెస్ నాశనం అవుతుంది: యోగి ఆదిత్యనాథ్

కాంగ్రెస్ పార్టీని నాశనం చేసేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రాలు చాలని.. ఇతరులెవరూ అవసరం లేదని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

Yogi Adityanath: రాహుల్, ప్రియాంక వల్లే కాంగ్రెస్ నాశనం అవుతుంది: యోగి ఆదిత్యనాథ్

Yogi

Yogi Adityanath: కాంగ్రెస్ పార్టీని నాశనం చేసేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రాలు చాలని.. ఇతరులెవరూ అవసరం లేదని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. సోమవారం లక్నోలో సీఎం యోగి ఏఎన్ఐ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ప్రతిపక్ష కాంగ్రెస్, ఎస్పీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు “బేకార్” కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని కోరినట్లు తెలిపిన సీఎం యోగి.. అలా చేస్తే వారి ఓట్లు వృధా అవుతాయని ఎద్దేవా చేశారు.

Also read: New Zealand: ఆందోళనకారులు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు: న్యూజీలాండ్ ప్రధాని

హిజాబ్ వివాదంపై స్పందించిన సీఎం యోగి ఆదిత్య నాథ్..వారి ‘ఘజ్వా-ఎ-హింద్’ కల “ఖయామత్” వరకు కూడా నెరవేరదని వ్యాఖ్యానించారు. భారత ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం పనిచేస్తుందని.. షరియా చట్టం ప్రకారం కాదని యోగి అన్నారు. విద్యాసంస్థల్లో ఏదైనా యూనిఫార్మ్ నే కొనసాగించాలని అభిప్రాయపడ్డ సీఎం యోగి, మతపరమైన దుస్తులు ధరించాలని తమ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులపై ఎన్నడూ ఒత్తిడి తెచ్చిన సందర్భాలు లేవని పేర్కొన్నారు. ఆమాటకొస్తే.. రాజ్యాంగ బద్ధమైన స్వేచ్ఛ ఉన్న భారత దేశంలో వ్యక్తిగత ఉద్దేశాలు ప్రజలపై రుద్దడం సబబుకాదని అభిప్రాయపడ్డారు.

Also read: Stock Market: కుప్పకూలిన స్టాక్ మార్కెట్ రూ.లక్షల కోట్ల సంపద ఆవిరి

భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ శరవేగంగా అభివృద్ధి పధంలో దూసుకుపోతోందని పేర్కొన్న సీఎం యోగి ఆదిత్యనాథ్.. సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్ అనే నినాదంతో బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఇందులో ఎక్కడా వివక్షకు తావులేకుండా ప్రజలకు రాజ్యాంగబద్ధ ఫలాలను అందిస్తూ, దేశాన్ని ముందుకు నడిపించడమే బీజేపీ ప్రభుత్వం కర్తవ్యమని సీఎం యోగి ఆదిత్యనాథ్ వివరించారు. హిజాబ్ వివాదాలు, ఇతర రాజకీయ ఎత్తుగడలతో కొందరు కూడగట్టుకుని.. దేశాభివృద్ధికి స్పీడ్ బ్రేకుల్లా తయారయ్యారని యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు.

Also read: Ukraine-Russia: బైడెన్ గారూ మీరు ఉక్రెయిన్ రండి: ఉక్రెయిన్ అధ్యక్షుడు