GVL Narasimaharao: మీ సీఎంతో కనీసం అపాయింట్మెంట్ సాధించండి వైకాపా ఎంపీలపై జీవీఎల్ నరసింహారావు ఫైర్

ఏపీలో చేపట్టిన ప్రాజెక్టులు, నిర్మాణాలు, నిధులకు సంబంధించి చట్ట సభల్లో తానే స్వయంగా ప్రస్తావించానని చెప్పిన జీవీఎల్ వైకాపా ఎంపీలు చేసిందేమిటో ప్రజలకు వివరించాలని సవాల్ విసిరారు.

GVL Narasimaharao: మీ సీఎంతో కనీసం అపాయింట్మెంట్ సాధించండి వైకాపా ఎంపీలపై జీవీఎల్ నరసింహారావు ఫైర్

Gvl

GVL Narasimaharao: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కేంద్రానికి రావాల్సిన నిధుల్లో ఏపీ ప్రభుత్వం తన వాటా చెల్లించకపోవడంతోనే.. కేంద్రం నుంచి ఏపీకి అందాల్సిన సహాయం ఆగిపోయిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ చేసిన వ్యాఖ్యలపై వైకాపా ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేయగా..నేడు వైకాపా ఎంపీల నుద్దేశించి ఎంపీ జీవీఎల్ మాట్లాడారు. విజయవాడలో ఎంపీ జీవీఎల్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం, ఎంపీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీలో చేపట్టిన ప్రాజెక్టులు, నిర్మాణాలు, నిధులకు సంబంధించి చట్ట సభల్లో తానే స్వయంగా ప్రస్తావించానని చెప్పిన జీవీఎల్ వైకాపా ఎంపీలు చేసిందేమిటో ప్రజలకు వివరించాలని సవాల్ విసిరారు.

Also read: Pulwama Attack: పుల్వామా ఉగ్ర దాడికి మూడేళ్లు: ప్రధాని మోదీ నివాళి

కేంద్రం నుంచి ఏపీకి ఎంతవరకు సాయం చేయగలమని ఆలోచన చేస్తున్నని, 22 మంది వైసిపి ఎంపీలు చేయాల్సిన పనిని ఒక్కడినే చేస్తున్నా అంటూ ఎంపీ జీవీఎల్ చెప్పుకొచ్చారు. విశాఖలో రూ.22 వేల కోట్లతో భారీ ప్రాజెక్టును బీజేపీ ప్రభుత్వం చేపట్టిందన్న జీవీఎల్.. 1956 నుండి ఇప్పటి వరకు ఇంత పెద్ద ప్రాజెక్టు ఏపీకి రాలేదని గుర్తుచేశారు. కేంద్ర పధకాలకు స్టిక్కర్లు వేసుకుని, వైసీపీ నేతలు ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారని..విమర్శించారు. రాష్ట్రానికి ఇంత చేస్తుంటే…‌ వైసీపీ నేతలు కనీసం కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు కుడా చెప్పలేకపోయారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు.

Also read: Schools Reopen: పలు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో తెరుచుకున్న పాఠశాలలు, విద్యార్థులేరి?
బీజేపీ చేస్తున్న పనుల గురించి మాట్లాడితే..తమ లోపాలు బయట పడతాయనే వైసీపీ ఎంపీలు భయపడుతున్నారని, ముందుగా రాసుకున్న స్క్రిప్ట్ ను చదవడమే వైసిపి నాయకులకు అలవాటని జీవీఎల్ ఎద్దేవా చేశారు. బడ్జెట్ లో రాష్ట్ర ప్రస్తావన లేదంటూ వైసీపీ ఎంపీలు చేస్తున్న అసత్య ప్రచారాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన జీవీఎల్.. ఏమి చెయ్యకుండానే ఏపీకి ఇన్ని ప్రాజెక్టులు, రోడ్లు వచ్చాయా అని ప్రశ్నించారు. రాష్ట్రాలకు కేంద్రం నుంచి వచ్చిన ప్రాజెక్టులు, నిధుల్లో వైకాపా ఎంపీల ప్రయత్నం, కృషి ఎక్కడైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. వైసిపి ఎంపీలు అసమర్ధులు.. అందులే సందేహం లేదని వ్యాఖ్యానించిన జీవీఎల్.. వారి వారి నియోజకవర్గాల్లో సమస్యలపై చర్చించేందుకు కనీసం సీఎం జగన్ అపాయింట్మెంట్ అయినా సాదించగలరా అంటూ సవాల్ విసిరారు. ప్రభుత్వ వైఫల్యాలు కప్పి పుచ్చుకునేందుకే వైసీపీ నేతలు కొత్త రాజకీయ సమస్యలు తెరపైకి తెస్తున్నారని..మండిపడ్డారు.

Also read: Yogi Adityanath: రాహుల్, ప్రియాంక వల్లే కాంగ్రెస్ నాశనం అవుతుంది: యోగి ఆదిత్యనాథ్

ఈనెల 17న కేంద్ర రోడ్లు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారని జీవీఎల్ తెలిపారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం రాష్ట్రాలకు కేంద్రం విడుదల చేస్తున్న రూ.లక్ష కోట్లలో ఏపీకి రూ.5 వేల కోట్లు రానుండగా.. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను ఆ నిధులతో పూర్తిచేయాలని భావిస్తున్నట్లు జీవీఎల్ వివరించారు. విశాఖపట్నం రైల్వే జోన్ కు ఇబ్బందులు ఉన్నా త్వరలో వాటిని పరిష్కరిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని ఎంపీ జీవీఎల్ పేర్కొన్నారు.

Also read: New Zealand: ఆందోళనకారులు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు: న్యూజీలాండ్ ప్రధాని