Chalapathi Rao : నేడే చలపతి రావు అంత్యక్రియలు..

చలపతి రావు ఇద్దరు కుమార్తెలు మంగళవారం రాత్రి అమెరికా నుంచి వచ్చారు. దీంతో నేడు శనివారం ఉదయం 9 గంటలకు మహాప్రస్థానంలో నటుడు చలపతిరావు అంత్యక్రియలు...........

Chalapathi Rao : నేడే చలపతి రావు అంత్యక్రియలు..

Chalapathi Rao Funeral in Mahaprasthanam

Updated On : December 28, 2022 / 7:55 AM IST

Chalapathi Rao :  2022లో టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి. ఈ సంవత్సరం టాలీవుడ్ ఎంతోమంది అగ్రతారలని కోల్పోయింది. మూడు రోజుల క్రితం డిసెంబర్ 24న ప్రముఖ నటుడు చలపతిరావు కన్నుమూశారు. 78 ఏళ్ళ వయసులో రాత్రి పూట గుండెపోటు రావడంతో హఠాత్తుగా మరణించారు. 600 కి పైగా సినిమాల్లో విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ప్రేక్షకులని మెప్పించారు. ఆయన మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు.

చలపతి రావు కుమారుడు నటుడు, డైరెక్టర్ రవిబాబు ఇక్కడే ఉన్నా ఆయన ఇద్దరు కుమార్తెలు ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. అయితే వాళ్ళు వచ్చాకే అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటివరకు అయన భౌతికకాయాన్ని మహాప్రస్థానం ఫ్రీజర్ లో ఉంచారు.

Chalapathi Rao Funeral : మూడు రోజుల తర్వాతే చలపతి రావు అంత్యక్రియలు.. అప్పటిదాకా..

చలపతి రావు ఇద్దరు కుమార్తెలు మంగళవారం రాత్రి అమెరికా నుంచి వచ్చారు. దీంతో నేడు శనివారం ఉదయం 9 గంటలకు మహాప్రస్థానంలో నటుడు చలపతిరావు అంత్యక్రియలు జరగనున్నాయి. చలపతి రావు కుమారుడు రవిబాబు ఆయనకి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.