Chalapathi Rao : నటుడు చలపతి రావు కన్నుమూత..

టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకొంది. సీనియర్ నటుడు చలపతి రావు ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. తెలుగుతెరపై విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సేవలు అందించిన చలపతి రావు మరణవార్త విని సినీ పరిశ్రమ దిగ్బ్రాంతికి గురయ్యింది.

Chalapathi Rao : నటుడు చలపతి రావు కన్నుమూత..

Chalapathi Rao passed away

Updated On : December 25, 2022 / 7:42 AM IST

Chalapathi Rao : టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకొంది. సీనియర్ నటుడు చలపతి రావు ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. తెలుగుతెరపై విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సేవలు అందించిన చలపతి రావు మరణవార్త విని సినీ పరిశ్రమ దిగ్బ్రాంతికి గురయ్యింది. 1200 పైగా సినిమాల్లో నటించిన చలపతి రావు నిర్మాతగానూ పలు సినిమాలను నిర్మించాడు.

Kaikala Satyanarayana : అధికార లాంఛనాలతో ముగిసిన కైకాల అంతక్రియలు..

సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు అందరితో స్క్రీన్ షేర్ చేసుకున్న చలపతి రావు వెండితెరపై ఒక వెలుగు వెలిగారు. చలపతి తనయుడు రవిబాబు కూడా సినీ రంగానికి నటుడుగా, దర్శకుడిగా సేవలు అందిస్తున్నాడు. అయితే గత కొన్ని రోజులుగా వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న చలపతి ఈరోజు ఉదయం గుండెపోటుతో మరణించారు.

అనారోగ్యం కారణంగా కొంతకాలం నుంచి కుమారుడు రవిబాబు ఇంటిలోనే ఉంటున్న చలపతి, అక్కడే తుది శ్వాస విడిచారు. చలపతి కుమార్తె అమెరికాలో ఉంది. ఆమె బుధవారం హైదరాబాద్ చేరుకోనుంది. అప్పటివరకు చలపతి రావు భౌతికకాయాన్ని జూబిలీహిల్స్ మహాప్రస్థానం ఫ్రీజర్ లో పెట్టనున్నారు. ఈరోజు మధ్యాహ్నం వరకు ఇంటివద్దే కుటుంబసభ్యులు, స్నేహితులు, సినీప్రముఖులు, అభిమానుల సందర్శనార్ధం కోసం ఉంచనున్నారు. చలపతి కూతురు వచ్చిన తరువాతే, బుధవారం అంత్యక్రియలు చేయనున్నారు.