94 ఏళ్ల బామ్మ..ఆమే పేరే బ్రాండ్..స్టార్టప్ తో లక్షలు సంపాదన

94 ఏళ్ల బామ్మ..ఆమే పేరే బ్రాండ్..స్టార్టప్ తో లక్షలు సంపాదన

94 year old women Harbhajan Kaur Startup: 30 ఏళ్లకే మోకాళ్ల నొప్పులు..40 ఏళ్లకే నడుము నొప్పులు అంటూ హైరానా పడేవాళ్లను ఎంతోమందిని చూశాం. కానీ 94 ఏళ్ల వయస్సులో వ్యాపారం చేస్తూ లక్షల రూపాయలు సంపాదించే హర్భన్ కౌన్ అనే బామ్మగారిని చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. కొంతమందైతే నవ యువకులుగా ఉండి కూడా ఏమీ చేయకుండా బలాదూర్ తిరిగేవాళ్లు ఈ బామ్మగారిని చూసి బుద్ధి తెచ్చుకోవాల్సిందే. 94 ఏళ్ల వయస్సులో వ్యాపారాన్ని అవలీలగా చేసేస్తూ లక్షలు సంపాదిస్తున్న హర్భజన్ కౌర్ ఛండీగఢ్‌లో ఓ బ్రాండ్ గా మారిపోయారు.

ఎంతో రుచికరమైన పచ్చళ్లతో పాటు మరెన్నో రకాల స్వీట్లు చేయటంలో హర్భజన్ సిద్ధహస్తురాలు. ఆమె చేతి వంట తింటే మరోసారి తినకుండా ఉండలేరు. అంత టేస్టీగా చేస్తారావిడ..94 ఏళ్ల వయస్సులో కూడా కష్టమే ఫలి అంటున్న ఈ బామ్మ ఎంతోమంది యువకులకు ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు. జీవితంలో సక్సెస్ సాధించడానికి వయసుతో పనిలేదని..పనిచేయడంలో నిబద్దత ఉంటె చాలు అంటూ నిరూపించారు 94 ఏళ్ల హర్భజన్ కౌర్.

మనుమలు..ముని మనవళ్లతో ఆడుకుంటూ కాలక్షేపం చేసే వయస్సులో హర్భజన్ కౌర్ నాలుగేళ్ల కిందట ఆమె పేరు హర్భజన్ పేరు మీదే స్టార్టప్ ప్రారంభించారు. అలా అలా ఆమె పేరే ఓ బ్రాండ్ అయిపోయారు. హర్భజన్ పేరుతో పచ్చళ్లు..స్వీట్లు తయారు చేసి అమ్మడం ప్రారంభించారు. ఓ స్కూల్ దగ్గర ఐస్ క్రీమ్ అమ్మడం ప్రారంభించారావిడ మొదటిసారి.

రు. 2వేలు ఆదాయం వచ్చేది. దీంతో ఆమె నేనెందుకు దీన్ని పెద్దదిగా చేయకూడదు? అని అనుకున్నారు. అనుకోవటమే కాదు చేయగలను అని తనమీద తాను సంపూర్ణ నమ్మకంతో మరింతగా వ్యాపారాన్ని విస్తరించారు.

పచ్చళ్లు చేయడం ప్రారంభించారు. ఆ పచ్చళ్ళు మంచి టేస్టీగా ఉండడమే కాదు.. నిల్వతో పాటు ధరలు వినియోగదారులకు అందుబాటులో ఉండడంతో.. చాలా మంది వాటిని మళ్లీ మళ్లీ కొనడం ప్రారంభించారు. ఇక ఆ పచ్చళ్ళు మార్కెట్‌లో బ్రాండెడ్ పచ్చళ్ల కంటే తక్కువ ధరకే హర్భజన్ కౌర్ అమ్మడంతో.. వ్యాపారం బాగా విస్తరించింది.

ఇప్పుడు ఆమె ఎన్నో స్వీట్లు తయారు చేసి అమ్ముతున్నారు. ఆమె చేత్తో తయారు చేసే పచ్చళ్లు, స్వీట్ల రుచికి జనాలు ఫిదా అయిపోయారు. అలా ఆమె వ్యాపారం పెరిగింది. ఛండీగఢ్‌లో హర్భజన్ ఓ బ్రాండెడ్ కంపెనీగా మారిపోయింది.

దీంతో 94 ఏళ్ల బామ్మ ఇంత చేస్తున్న ఆమె యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. స్టార్టప్ తో ప్రారంభమైన ఆమె చిరు వ్యాపారం ఈరోజు లక్షల్లో టర్నోవర్ కు వెళ్లింది. మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా ఆమెను అభినందించారు అంటే ఆమె స్ఫూర్తి ఎంతటిదో ఊహించుకోవచ్చు.

ఈ సంవత్సరపు పారిశ్రామిక వేత్త హర్భజన్ కౌర్ అంటూ ట్విట్టర్ వేదికగా ఆనంద్ మహేంద్ర ప్రశంసల వర్షం కురిపించారు. 94ఏళ్ల వయస్సులో ఓ మహిళ ఓ బ్రాండ్ గా మారటం మాటలు కాదు. దాని వెనుక హర్భజన్ కౌర్ కష్టం. పట్టుదల, సంకల్పబలం ఎంతో ఉన్నాయి. తన కష్టంతో తనకంటూ ఓ పేజీలిఖించుకున్నారు ఈ బామ్మ.ఇప్పుడు ఛండీగఢ్‌లో హర్భజన్ ఓ బ్రాండెడ్ కంపెనీగా మారిపోయింది.