Jeevan Kumar : సీనియ‌ర్ న‌టి పావ‌లా శ్యామ‌ల, టీఎన్‌ఆర్ కుటుంబాల‌కు న‌టుడు జీవ‌న్ కుమార్ సాయం..

న‌టుడిగా చిన్న ఇమేజ్ ఉన్న వాడైనా ఎదుట‌వారి క‌ష్టాన్ని తీర్చ‌డంలో మాత్రం జీవ‌న్ పెద్ద మ‌న‌సును చూపించారు. క‌రోనా క‌ష్ట‌కాలంలో రోజూ 300కి పైగా క‌రోనా రోగుల‌కు ఆక‌లి తీరుస్తున్నారు జీవ‌న్ కుమార్..

Jeevan Kumar : సీనియ‌ర్ న‌టి పావ‌లా శ్యామ‌ల, టీఎన్‌ఆర్ కుటుంబాల‌కు న‌టుడు జీవ‌న్ కుమార్ సాయం..

Jeevan Kumar1

Jeevan Kumar: న‌టుడిగా చిన్న ఇమేజ్ ఉన్న వాడైనా ఎదుట‌వారి క‌ష్టాన్ని తీర్చ‌డంలో మాత్రం జీవ‌న్ పెద్ద మ‌న‌సును చూపించారు. క‌రోనా క‌ష్ట‌కాలంలో రోజూ 300కి పైగా క‌రోనా రోగుల‌కు ఆక‌లి తీరుస్తున్నారు జీవ‌న్ కుమార్. సీనియ‌ర్ న‌టి పావ‌లా శ్యామ‌లా ప‌రిస్థ‌తి విని చ‌లించిన జీవ‌న్ కుమార్ వారికి స‌హాయంగా నిలిచారు. పావ‌లా శ్యామ‌లా ఇంటికి వెళ్ళి ఆమె ప‌డుతున్న క‌ష్టాల‌ను అర్ధం చేసుకొని కొన్ని అవ‌స‌ర‌మైన నిత్యావ‌స‌రాలతో పాటు ప‌దివేల రూపాయలు ఆమె అవ‌స‌రాల‌కు అందించారు.

Pavala Syamala

ఎవరైతే రోజు వారీ ప‌నులు చేసుకునే ప‌రిస్థితిలో లేర‌ని గ‌మ‌నించి వారింటికి రోజూ భోజ‌నం పంపుతాన‌ని, ఏ స‌హాయం కావాల‌న్నా ముందుంటాని హామీ ఇచ్చారు. జీవ‌న్ ఎవ‌రో తెలియ‌క‌పోయినా త‌న ప‌రిస్థ‌తికి స్పందించి వ‌చ్చినందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు పావ‌లా శ్యామ‌లా. జీవ‌న్ వంటి వ్య‌క్తుల వ‌ల‌న త‌న‌కు ఎంతో మ‌నో ధైర్యం వ‌స్తుంద‌ని ఆమె అన్నారు.

Pavala Syamala

Pavala Syamala

Jeevan Kumar : చిన్న న‌టుడు..పెద్దమనసు.. రియల్ లైఫ్‌లో హీరోగా నిలిచిన జీవన్ కుమార్..

సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్, న‌ట‌డు టీఎన్‌ఆర్ కుటుంబానికి కూడా స‌హాయంగా నిలిచారు జీవ‌న్ కుమార్. టీఎన్‌ఆర్ ఆక‌స్మిక మ‌ర‌ణం వారి కుటుంబ జీవ‌న‌చిత్రాన్ని మార్చివేసింది. ఆయ‌న లోటు తీర‌నిది.. జ‌ర్న‌లిస్ట్‌గానే కాకుండా, న‌టుడిగా కూడా రాణిస్తున్న టీఎన్‌ఆర్ మ‌ర‌ణ వార్త అంద‌రినీ క‌లిచివేసింది. ఆయ‌న కుటుంబానికి అండ‌గా నిలబడేందుకు జీవ‌న్ కుమార్ ముందుకు వచ్చారు. టీఎన్‌ఆర్ స‌తీమ‌ణి జ్యోతి గారిని ప‌రామ‌ర్శించి 50 వేల రూపాయలు త‌న వంతు స‌హాయం అందించారు.

TNR

TNR

ఈ సంద‌ర్భంగా జీవ‌న్ కుమార్ మాట్లాడుతూ :‘‘పావ‌లా శ్యామ‌లా గారి ప‌రిస్థ‌ితి చూసి చాలా బాధ వేసింది. అంత సీనియ‌ర్ న‌టి ఇలాంటి ప‌రిస్థితిలో ఉండ‌టం చాలా విచార‌క‌రం. అందుకే నా వంతుగా స‌హాయం చేశాను. ఆమెకు ఎలాంటి స‌హాయం కావాల‌న్నా ముందు నిల‌బ‌డేందుకు సిద్ధంగా ఉంటాను.. టీఎన్‌ఆర్ గారు నాకు జ‌ర్న‌లిస్ట్‌గా బాగా ఇష్ట‌మైన వ్య‌క్తి.. ఆయ‌న మ‌ర‌ణం నన్ను క‌లిచివేసింది. వారి స‌తీమ‌ణి జ్యోతి గారితో మాట్లాడుతుంటే నేను త‌ట్టులేక‌పోయాను. వారి కుటుంబానికి ఎప్పుడూ అండ‌గా ఉంటాను’’.. అన్నారు..