Dalit Bandhu : హుజూరాబాద్ కు సీఎం కేసీఆర్, ఏర్పాట్లు ఎలా చేశారో తెలుసా ?
హుజూరాబాద్ కు సీఎం కేసీఆర్, ఏర్పాట్లు ఎలా చేశారో తెలుసా ?

Cm Kcr
CM KCR Dalit Bandhu Sabha : దళితబంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌లో ప్రారంభిస్తుండటంతో ఈ సభకు రాజకీయంగానూ ప్రాధాన్యత ఏర్పడింది. లక్ష మందికి సభ ప్రాంగణాన్ని సిద్ధం చేశారు అధికార పార్టీ నేతలు. స్టేజీపై 250మంది కూర్చునేలా ఏర్పాటు చేశారు. వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా రెయిన్‌ఫ్రూఫ్ టెంట్లతో పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు. హుజూరాబాద్ – జమ్మికుంట రోడ్డు పక్కనున్న శాలపల్లి- ఇంద్రానగర్‌లో 20 ఎకరాల్లో బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు.
Read More : Adani Group : ఈ-కామెర్స్ లోకి అదానీ గ్రూప్.. పేటీఎం.. ఫోన్ పేలతో సై అంటే సై
ట్రాఫిక్ ఆంక్షలు : –
నియోజకవర్గంలోని దళిత కుటుంబాలతో పాటు మహిళా సంఘాల వారిని, ప్రజలను ఇక్కడికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సభ విజయవంతం కోసం అధికారులు, పార్టీ శ్రేణులు ప్రయత్నిస్తుండగా… 825 బస్సులు, మరో 600 వరకు ఇతర వాహనాల్ని ఉపయోగిస్తున్నారు. భద్రత కోసం 3500 మంది పోలీసులను వినియోగిస్తున్నారు. సీఎం కేసీఆర్ సభ నేపద్యంలో ఇప్పటికే పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఏర్పాట్లను పరిశీలించిన హరీశ్ రావు : –
సీఎం సభ ఏర్పాట్లను మంత్రి హరీశ్‌రావు దగ్గరుండి పర్యవేక్షించారు. మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌తో కలిసి హరీశ్‌రావు సభా స్థలాన్ని పరిశీలించారు. పార్కింగ్ కోసం 15 స్థలాలను కేటాయించారు. హుజూరాబాద్ నుంచి వచ్చే వాహనాలకు చెల్పూర్ గ్రామం నుంచి ఇందిరానగర్ వరకు 10 పార్కింగ్ ప్లేస్ లు, జమ్మికుంట నుంచి వచ్చే వాహనాల కోసం 4 పార్కింగ్ స్థలాలు కేటాయించారు.
అర్హులైన వారందరికీ పథకం వర్తింపు : –
హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో దళిత బంధు ప్రారంభించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అర్హులైన వారందరికి పథకాన్ని వర్తించేలా చేస్తామంటూ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ప్రారంభ కార్యక్రమానికి మాత్రం ఎంపిక చేసిన 15 మందికి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా దళిత బంధును అందుకునేలా జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.