Akhanda-Acharya : అఖండ.. ఆచార్య.. ఈ రెండు సినిమాల్లో కామన్ పాయింట్స్ ఇవే..

సీనియర్ స్టార్ హీరోలు బాలకృష్ణ, చిరంజీవి కూడా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల బాలకృష్ణ అఖండ సినిమాతో వచ్చి భారీ విజయం సాధిస్తే తాజాగా చిరంజీవి ఆచార్య సినిమాతో వచ్చి విజయం.................

Akhanda-Acharya : అఖండ.. ఆచార్య.. ఈ రెండు సినిమాల్లో కామన్ పాయింట్స్ ఇవే..

Akhanda

Akhanda-Acharya :   ఇటీవల మన తెలుగు సినిమాలు వరుసగా విజయం సాధిస్తున్నాయి. కరోనా రెండో వేవ్ తర్వాత భయపడుతూనే టాలీవుడ్ లో సినిమాలు రిలీజ్ చేశారు. అయినా రిలీజ్ అయిన ప్రతి సినిమాకి మంచి విజయాన్ని అందించారు తెలుగు ప్రేక్షకులు. సీనియర్ స్టార్ హీరోలు బాలకృష్ణ, చిరంజీవి కూడా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల బాలకృష్ణ అఖండ సినిమాతో వచ్చి భారీ విజయం సాధిస్తే తాజాగా చిరంజీవి ఆచార్య సినిమాతో వచ్చి విజయం సాధించారు. అయితే ఈ రెండు సినిమాలలో, వీరిద్దరికి ఈ సినిమాలతో చాలా కామన్ పాయింట్స్ ఉన్నాయి.

చిరంజీవి ఆచార్య కంటే ముందు సినిమా 2019లో సైరా నరసింహరెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. బాలకృష్ణ కూడా అఖండ కంటే ముందు 2019లోనే రూలర్ సినిమాతో వచ్చారు. ఆచార్య, అఖండ రెండు సినిమాలు కూడా దాదాపు ఒకేసారి మొదలయ్యాయి. ఈ రెండు సినిమాలు రిలీజ్ అవ్వడానికి కరోనా వల్ల ఇద్దరికీ రెండు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. ఇక ఈ రెండు సినిమాలు కూడా దాదాపు ఒకేసారి షూటింగ్ ని పూర్తి చేసుకున్నాయి.

Kashmir Files : 50 రోజుల కశ్మీర్ ఫైల్స్.. చిన్న సినిమాకి ఊహించని పెద్ద విజయం

అయితే కరోనా రెండో వేవ్ తర్వాత బాలకృష్ణ వెంటనే అఖండ సినిమా రిలీజ్ చేయగా, చిరంజీవి మాత్రం కరెక్ట్ టైం చూసుకొని కరోనా వేవ్ భయం మొత్తం పోయాక రిలీజ్ చేశారు. మొదట ఈ సినిమాలని ఒకేసారి వారం రోజులు గ్యాప్ తో అనౌన్స్ కూడా చేశారు. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చాయి. ఇక ఈ రెండు సినిమాలలో కామన్ పాయింట్స్ ధర్మాన్ని రక్షించడం, మైనింగ్ మాఫియా.

Kangana Ranaut : లాంగ్వేజ్ వార్.. హిందీ వద్దు సంస్కృతం ముద్దు అంటూ ఎంటర్ అయిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్..

అఖండ సినిమాలో బాలకృష్ణ వచ్చి మైనింగ్ మాఫియా చేసేవాళ్ళని అంతమొందించి ధర్మాన్ని కాపాడతాడు. ఆచార్య సినిమాలో కూడా చిరంజీవి వచ్చి మైనింగ్ మాఫియాని అంతం చేసి ధర్మాన్ని కాపాడతాడు. అలాగే ఈ రెండు సినిమాల్లోనూ మెయిన్ క్యారెక్టర్స్ కి హీరోయిన్ లేదు. అఖండలో బాలకృష్ణ అఘోరా పాత్రకి, ఆచార్యలో చిరంజీవి నక్సలైట్ పాత్రకి హీరోయిన్ లేదు. ఈ రెండు సినిమాలు కూడా థియేటర్లలో రిలీజ్ అయి మంచి విజయాన్ని సాధించాయి. ఇలా అఖండ, ఆచార్య సినిమాలకు ఇన్ని కామన్ పాయింట్స్ ఉండటంతో ఇది తెలుసుకొని ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.