దీపిక.. ఫుల్ బిజీ.. ఎన్ని సినిమాలు చేస్తుందంటే..

దీపిక.. ఫుల్ బిజీ.. ఎన్ని సినిమాలు చేస్తుందంటే..

Deepika Padukone

Deepika Padukone: స్టార్ హీరోయిన్ దీపికా.. ఇప్పుడు బాలీవుడ్‌లోనే బిజియెస్ట్ హీరోయిన్. చిన్న పెద్దా, బాలీవుడ్, టాలీవుడ్ అన్న తేడా లేకుండా బ్యాక్ టు సినిమాలతో సందడి చేస్తోంది. పెళ్లైనా అస్సలు ఏమాత్రం డిమాండ్ తగ్గని ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఎన్ని సినిమాలతో బిజీగా ఉందో తెలుసా..?

దీపికా పడుకోన్ బాలీవుడ్‌లో వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉంది. అటు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరో వైపు వుమెన్ ఓరియంటెడ్, హిస్టారికల్ మూవీస్‌తో ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లే కాదు.. అంతకన్నా బిజీగా సినిమాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్ స్టార్ దీపికా ఇప్పుడు 5 భారీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది. ఆల్రెడీ భర్త రణ్‌వీర్ సింగ్‌తో కలిసి చేసిన ‘83’ రిలీజ్‌కు రెడీగా ఉంది.

‘83’ రిలీజ్‌కు రెడీ అవుతుండగానే దీపికా మరో సినిమా షూట్ స్టార్ట్ చేసింది. షారూఖ్ ఖాన్ రెండేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత చేస్తున్న ‘పఠాన్’ సినిమాతో పాటు.. సిద్ధాంత్ చతుర్వేది, అనన్య పాండేతో కలిసి శకున్ బాత్రా డైరెక్షన్లో మరో సినిమాలో బిజీగా ఉంది దీపిక. వీటితో పాటు జాన్ అబ్రహంతో భారీ బడ్జెట్ మూవీ ‘మహా భారత్’ సినిమా కూడాచేస్తోంది.

బాలీవుడ్‌లో బిజీగా ఉన్న దీపిక.. ఇప్పుడు టాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇస్తోంది. దీపికా పడుకోన్ లేటెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో పాన్ వరల్డ్ మూవీ చెయ్యడానికి రెడీ అవుతోంది. ప్రభాస్, దీపికా, అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్స్‌‌లో నాగ్ అశ్విన్ డైరెక్షన్లో తెరకెక్కబోయే ఫాంటసీ మూవీలోనూ నటిస్తూ వరుసగా 5 సినిమాలతో బిజియెస్ట్ హీరోయిన్ ఆఫ్ బాలీవుడ్ అయ్యింది దీపికా పడుకోన్.