Fast and Furious 9 : ఫాస్ట్ & ఫ్యూరియస్ చివరి పార్ట్..

ఈ సినిమాని సాగదియ్యకుండా మంచి వ్యూయర్ షిప్‌తోనే ఎండ్ చెయ్యాలని డిసైడ్ అయ్యారు మేకర్స్..

Fast and Furious 9 : ఫాస్ట్ & ఫ్యూరియస్ చివరి పార్ట్..

Fast And Furious 9

Fast and Furious 9: హాలీవుడ్‌లో సిరీస్, సీక్వెల్స్ హవా ఎప్పటినుంచో నడుస్తోంది. ఫస్ట్ పార్ట్ హిట్ అయ్యిందంటే చాలు.. వరుసగా ఆ సినిమాలకు సీక్వెల్స్ చేస్తూనే ఉంటారు మేకర్స్. లేటెస్ట్‌గా ఓ టాప్ హాలీవుడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కి ఎండ్ కార్డ్ పడే టైమొచ్చిందని ఆ సినిమా హీరో అనౌన్స్ చేశారు.

ఎంటర్‌టైన్‌మెంట్ చరిత్రలో ఇప్పుడు ఎలక్ట్రిఫైయింగ్ యాక్షన్ సీన్స్‌తో హాలీవుడ్ మోస్ట్ ఎంటర్‌టైనింగ్ సిరీస్ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’. ఈ సినిమాకి సంబంధించి నైన్త్ మూవీ ఇప్పుడు జూన్ 25న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికి 8 సిరీస్‌లు వచ్చినా… ఇంకా ఆ యాక్షన్ ఎంటర్‌టైనర్ నెక్ట్స్ సిరీస్‌లు ఎప్పుడొస్తాయా అని వెయిట్ చేస్తుంటారు ఫ్యాన్స్. అయితే మోస్ట్ సక్సెస్ ఫుల్ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ఫ్రాంచైజ్ ఇక ఎండ్ అయ్యే టైమొచ్చిందని షాక్ ఇచ్చారు మేకర్స్.

హాలీవుడ్ స్టార్ హీరో విన్ డీజిల్.. ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ కి సంబంధించి షాకింగ్ న్యూస్ రివీల్ చేశారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీకి సంబంధించి ఈమంత్ ఎండ్‌కి నైన్త్ పార్ట్ రిలీజ్ అవుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి రెండు సిరీస్‌లు మాత్రమే రిలీజ్ అవుతాయని, 11 పార్ట్స్ తర్వాత ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ని ఎండ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు.

ఆడియన్స్ అడిక్ట్ అయిపోయిన ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సిరీస్‌లో ప్రతి పార్ట్ ఎగ్జైటింగ్‌గా, ఎంటర్‌టైనింగ్‌‌గా, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా కంటిన్యూ అవుతోంది. కానీ, ఈ సినిమాకి మంచి ఎండింగ్ ఇచ్చే టైమైందని డిసైడ్ అయ్యారు మేకర్స్. 2001 లో రిలీజ్ అయిన ఫస్ట్ పార్ట్ 7300 కోట్ల కలెక్షన్స్‌తో రికార్డ్ క్రియేట్ చేసింది. అప్పటినుంచి కలెక్షన్లు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కానీ, ఇంకా ఈ సినిమాని సాగదియ్యకుండా మంచి వ్యూయర్ షిప్‌తోనే ఎండ్ చెయ్యాలని డిసైడ్ అయ్యారు మేకర్స్.