Heroins : వివాదాల్లో హీరోయిన్స్..

ఇటివల కూడా కొంతమంది హీరోయిన్స్ ఇలాగే ఆలోచించకుండా మాట్లాడి వివాదాల్లో ఇరుక్కున్నారు. కొంతమంది అయితే ఏకంగా నేషనల్ ఇష్యూలలో తలదూర్చారు.............

Heroins : వివాదాల్లో హీరోయిన్స్..

Heroins :  ఊరుకున్నంత ఉత్తమం ఉండదన్నారు పెద్దలు. అయితే ఇలాంటి మంచి మాటలకు తాము చాలా దూరం అనిపించుకుంటున్నారు కొందరు ఇండియన్ హీరోయిన్స్. అనవసరంగా నోరు జారడం, వివాదాల్లో పడడం ఫ్యాషన్ అయిపోయింది. అలా మాటలు తూలి చిక్కుల్లో పడ్డ అందమైన హీరోయిన్స్ గతంలో చాలా మంది ఉన్నారు. ఇటివల కూడా కొంతమంది హీరోయిన్స్ ఇలాగే ఆలోచించకుండా మాట్లాడి వివాదాల్లో ఇరుక్కున్నారు. కొంతమంది అయితే ఏకంగా నేషనల్ ఇష్యులలో తలదూర్చారు.

కన్నడ కస్తూరి రష్మికా మందన్న ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన కాంతార సినిమా ఇంతవరకు చూడనే చూడలేదని చెప్పడం, తనకి మొదటి ఆఫర్ ఇచ్చిన రిషబ్ శెట్టి పేరు చెప్పకుండా ఇంకెవరి పేరో చెప్పడంతో కన్నడ ప్రజలు తమ మనోభావాలు దెబ్బతిన్నాయని, ఆమెపై చాలా వ్యతిరేకత చూపిస్తున్నారు. దానివల్ల ఆమెను బ్యాన్ చేయాలని కన్నడ ఇండస్ట్రీ, థియేటర్ ఓనర్స్, ఆర్గనైజర్ అందరూ కలిసి ఆలోచిస్తున్నారట. అంతేకాదు త్వరలోనే కన్నడ ఇండస్ట్రీ రష్మికను బ్యాన్ చేస్తున్నట్లు అధికార ప్రకటన కూడా రానుందని కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం సౌత్ లో లీడింగ్ హీరోయిన్స్ లో ఒకరు పూజాహెగ్డే. ఎన్ని ఫ్లాప్స్ వస్తున్నా స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటూనే ఉంది ఈ బ్యూటీ. అయితే అమ్మడికి కూడా కాస్త నోటి దురుసు ఎక్కువే. గతంలో ఒక సందర్భంలో పూజా హెగ్డే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘దక్షిణాది ప్రేక్షకులకు బొడ్డు, నడుం అంటే చాలు.. వ్యామోహంలో పడిపోతారు’ అంటూ నోరు జారింది. ఈ వ్యాఖ్యలు వివాదానికి కారణం అయ్యాయి. ఒక దశలో ఆమెను సౌత్ ఇండస్ట్రీ బ్యాన్ చేయాలని కూడా డిమాండ్ చేశారు జనం.

కన్నడ బ్యూటీ రచితా రామ్ కూడా ఓ సందర్బంలో నోరు జారి నిర్మాతలు తనని బ్యాన్ చేసేంత రేంజ్ లో రచ్చ కు కారణమైంది. ఆమె నటించిన రొమాంటిక్ మూవీ ‘లవ్ యూ రాచు’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో ‘ప్రేమికుల మధ్య జరిగే రొమాంటిక్‌ కథే ఈ సినిమా అని చిత్రబృందం చెబుతోంది. ఇందులో కొన్ని సన్నివేశాలు బాగా బోల్డ్‌గా ఉన్నాయని అంటున్నారు. అని ప్రశ్నవేశారు. దానికి రచిత స్పందిస్తూ… పెళ్లయ్యాక ఎవరైనా ఏం చేస్తారు, రొమాన్సే కదా ఈ సినిమాలోనూ అదే ఉంటుంది అని అంది రచిత. దాంతో ఆమెను నిషేధించాలనే డిమాండ్స్ వచ్చాయి. ‘లవ్ యూ రాచు’ సినిమా ప్రదర్శించకుండా, విడుదలను అడ్డుకుంటామని చెప్పారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని కన్నడ ఫిల్మ్ ఛాంబర్​ రచితను ఆదేశించింది.

తాజాగా బాలీవుడ్ నటీమణి రీచా చద్దా.. ఇండియన్ ఆర్మీపై కాంట్రావర్సీ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ప్రభుత్వం ఆదేశిస్తే పాక్ ఆక్రమిత క‌శ్మీర్‌ను చేజిక్కించుకునేందుకు ఇండియ‌న్ ఆర్మీ సిద్ధంగా ఉన్నట్లు నార్తర్న్ ఆర్మీ క‌మాండ‌ర్ లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ ఉపేంద్ర ద్వివేది ట్వీట్ చేశారు. ఆ ప్రక‌ట‌న‌పై రిచా స్పందిస్తూ.. ‘గాల్వాన్ హాయ్ చెబుతోంది’ అంటూ కామెంట్ చేసింది. దాంతో ట్వీట్ తీవ్ర దుమారం రేపింది. ఆమెపై సోష‌ల్ మీడియాలో నెటిజెన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిచా ట్వీట్‌ భార‌తీయ ఆర్మీని చాలా చుల‌క‌న చేసిన‌ట్లు ఉందని, భారత జవాన్ల త్యాగాలను తక్కువ చేసేదిలా ఉందంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. స్టార్ సెలబ్రిటీలు సైతం ఆమెని తప్పుబట్టారు.

Prabhas-Krithi Sanon : ప్రభాస్-కృతి సనన్ రిలేషన్ నిజమేనా..?? లీక్ చేసిన బాలీవుడ్ హీరో..??

సౌత్ టాలెంటెడ్ బ్యూటీ సాయిపల్లవి సైతం ఆ మధ్య ఓ నేషనల్ ఇష్యూలో వివాదాన్ని రేపి వార్తల్లో నిలిచింది. ఒక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.. కశ్మీర్ పండిట్ల మారణహోమం, గో హత్యలను లింక్ చేసి మాట్లాడింది. ”నాకు వయలెన్స్ అనేది తప్పుగా అనిపిస్తుంది. పాకిస్థాన్‌లో ఉన్న వాళ్లకి మన జవాన్లు టెర్రరిస్ట్‌లా అనిపిస్తారు. ఎందుకంటే మనం హార్మ్ చేస్తామనుకుంటారు. మనకు వాళ్లు అలా కనిపిస్తారు. అని చెబుతూ.. ‘కొన్ని రోజుల క్రితం కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమా వచ్చింది కదా. వాళ్లు అందులో కాశ్మీర్ పండిట్లను ఎలా చంపారు అని చూపించారు. మనం వాటిని మత సంఘర్షణలా చూస్తున్నాము అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో సాయిపల్లవిని తీవ్ర విమర్శలు చుట్టు ముట్టాయి. హీరోయిన్స్ గా కెరీర్ బాగుండాలంటే నటన, అందం ఉంటే సరిపోదు నోరు కూడా అదుపులో ఉంచుకోవాలి, అనవసర విషయాల్లో తలదూర్చి వివాదాల్లోకి ఎక్కొద్దు అను అంటున్నారు ప్రేక్షకులు.