I Am Meera : ఓటీటీలో ప్రిన్స్ సినిమా.. ‘ఐ యామ్ మీరా’..

శ్రీ శివ భవాని సినిమా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ‘జాబిల్లి కోసం ఆకాశమల్లె’ చిత్రాన్ని నిర్మించిన గుగ్గిళ్ల శివ ప్రసాద్ రెండో ప్రయత్నంగా రూపొందిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఐ యామ్ మీరా’..

I Am Meera : ఓటీటీలో ప్రిన్స్ సినిమా.. ‘ఐ యామ్ మీరా’..

I Am Meera Movie Teaser Released

I Am Meera: శ్రీ శివ భవాని సినిమా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ‘జాబిల్లి కోసం ఆకాశమల్లె’ చిత్రాన్ని నిర్మించిన గుగ్గిళ్ల శివ ప్రసాద్ రెండో ప్రయత్నంగా రూపొందిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఐ యామ్ మీరా’.. ప్రిన్స్, దివ్యంగాన హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి గోపాల కృష్ణ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ టీజర్ ‘విరాట పర్వం’ చిత్ర దర్శకులు వేణు ఉడుగుల రిలీజ్ చేశారు…

I Am Meera

ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ గుగ్గిళ్ల శివప్రసాద్ మాట్లాడుతూ : ‘‘మొదట మా శ్రీ శివ భవాని సినిమా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ‘జాబిల్లి కోసం ఆకాశమల్లె’ చిత్రాన్ని నిర్మించాము.. రెండో ప్రయతంగా సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లో ‘Iam Meera’ మూవీని రూపొందిస్తున్నాం’ అన్నారు…

ఈ సినిమా మంచి క్వాలిటీతో అనుకున్నది అనుకున్నట్లుగా నిర్మించామని తెలిపారు. ఈ సినిమా ఆద్యంతం ఆసక్తికర కథ కథనాలతో సాగుతుందని.. ముఖ్యంగా యూత్‌‌ని బాగా ఆకట్టుకుంటుందని తెలిపారు… త్వరలోనే OTT ద్వారా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు..

I Am Meera

బ్యానర్ : శ్రీ శివ భవాని ప్రొడక్షన్స్
నటీనటులు : ప్రిన్స్, దివ్యంగాణ, కేదార్ శంకర్, శశిధర్, మల్లికార్జున్
డైరెక్టర్ : గోపాల్ కిషన్
ప్రొడ్యూసర్: శివప్రసాద్ గుగ్గిళ్ల
కో-ప్రొడ్యూసర్స్ : గుగ్గిళ్ల రాము, గుగ్గిళ్ల నాగభూషణం
సంగీతం : భరత్
కెమెరా : ప్రభాకర్ రెడ్డి .జె
పాటలు : గణేష్ చిన్న మెస్రం
ఎడిటర్ : బసవా రెడ్డి పైడి..