IPL 2021 RR Vs CSK.. శివమెత్తిన దూబే.. చెన్నైని చిత్తు చేసిన రాజస్తాన్

ఐపీల్ 2021 రెండో దశలో భాగంగా రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ జట్టు దుమ్ములేపింది. చెన్నై పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చ

IPL 2021 RR Vs CSK.. శివమెత్తిన దూబే.. చెన్నైని చిత్తు చేసిన రాజస్తాన్

Shivam Dube

IPL 2021 RR Vs CSK : ఐపీల్ 2021 రెండో దశలో భాగంగా రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ జట్టు దుమ్ములేపింది. చెన్నై పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చెన్నై విధించిన భారీ టార్గెట్ ను రాజస్తాన్ 17.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి చేజ్ చేసింది. రాజస్తాన్ జట్టులో ఓపెనర్ యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు.

Yashasvi Jaiswal

యశస్వి 21 బంతుల్లో 50 పరుగులు చేశాడు. మంచి శుభారంభం ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన శివమ్ దూబే శివాలెత్తాడు. సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. హాఫ్ సెంచరీ చేసి జట్టుని గెలిపించాడు. 42 బంతుల్లో పరుగులు 64 చేశాడు. రాజస్తాన్ కెప్టెన్ సంజూ శాంసన్ 24 బంతుల్లో 28 పరుగులతో మెరిశాడు. కాగా, చెన్నై ఓపెనర్ రుతురాజ్ సెంచరీ వృథా అయ్యింది. చాలా గొప్పగా ఆడాడు. చెన్నై భారీ స్కోర్ చేసిందంటే అది రుతురాజ్ వల్లే. కానీ లాభం లేకపోయింది. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 2, ఆసిఫ్ ఒక వికెట్ తీశారు.

Siddharth: మోసగాళ్లు ఎప్పటికీ అభివృద్ధి చెందలేరు.. సమంతా గురించేనా?

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై చెలరేగింది. సూపర్ ఫామ్ లో ఉన్న చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఈ మ్యాచ్ లో చెలరేగాడు. సెంచరీతో కదం తొక్కాడు. 60 బంతుల్లో సెంచరీ(101) బాదాడు. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టడం ద్వారా రుతురాజ్ సెంచరీ నమోదు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 5 సిక్సులు, 9 ఫోర్లు ఉన్నాయి. రుతురాజ్ నాటౌట్ గా నిలిచాడు.

Ruturaj Gaikwad

రుతురాజ్ విజృంభణతో చెన్నై భారీ స్కోర్ చేసింది. నిర్ణీత ఓవర్లలో సీఎస్కే 4 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. డుప్లెసిస్ 25 పరుగులు, మోయిన్ అలీ 21 పరుగులు, జడేజా 32 పరుగులు(నాటౌట్) చేశారు. రాజస్తాన్ బౌలర్లలో రాహుల్ తెవాటియా 3 వికెట్లు తీశాడు. చేతన్ సకారియా ఒక వికెట్ తీశాడు.

Dethadi Harika: ఒంపులతో దేత్తడి అందాల జాతర!

Ruturaj Gaikwad roars

స్కోర్లు..
చెన్నై.. 189/4
రాజస్తాన్..190/3(17.3ఓవర్లు)