IPL Bowling records: ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-10 బౌలర్లు వీరే..

ఐపీఎల్ లో విదేశీ ఆటగాళ్లూ సత్తాచాటుతున్నారు. 2008 నుంచి గణాంకాలు చూస్తే డ్వేన్ బ్రావో 183 వికెట్లు, లసిత్ మలింగా 170 వికెట్లు తీశారు. తొలి రెండు స్థానాల్లో వారే ఉన్నారు.

IPL Bowling records: ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-10 బౌలర్లు వీరే..

IPL Bowling records

Updated On : April 3, 2023 / 9:11 PM IST

IPL Bowling records: ప్రస్తుతం దేశ అంతటా ఐపీఎల్ (IPL) ఫీవర్ ఉంది. క్రికెట్ అభిమానులు టీవీలకు, మొబైల్ ఫోన్లలో ఐపీఎల్ మ్యాచులు చూస్తూ కాలాన్ని గడిపేస్తున్నారు. ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-10 బౌలర్ల గురించి తెలుసుకుందాం. ఐపీఎల్ (2008-2023) చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా డ్వేన్ బ్రావో (Dwayne Bravo) కొనసాగుతున్నాడు.

డ్వేన్ బ్రావో (Dwayne Bravo) 2008-2022 మధ్య 183 వికెట్లు తీశాడు. ఐపీఎల్-2023లో ఇప్పటివరకు జరిగిన 5 మ్యాచులతో కలిపి ఈ బౌలర్ల వివరాలు అందిస్తున్నాం. ప్రస్తుతం ఐపీఎల్ లో మొత్తం 70 లీగ్ మ్యాచులు జరుగుతాయి.

టాప్-10 బౌలర్లు
1. చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ లయన్స్, ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన డ్వేన్ బ్రావో 183 వికెట్లు తీశాడు

2. ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన లసిత్ మలింగా 170 దక్కించుకున్నాడు

3. ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన యజువేంద్ర చాహల్ 170 వికెట్లు తీశాడు

4. డెక్కన్ ఛార్జర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన అమిత్ మిష్రా 166 వికెట్లు పడగొట్టాడు

5. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్, రాజస్థాన్ రాయల్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ తరఫున ఆడిన రవిచంద్రన్ అశ్విన్ 158 వికెట్లు తీశాడు

6. చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్, కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన పీయూష్ చావ్లా 157 వికెట్లు పడగొట్టాడు

7. పూణే వారియర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన భువనేశ్వర్ కుమార్ 154 వికెట్లు తీశాడు

8. కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడిన సునీల్ నరైన్ 153 వికెట్లు పడగొట్టాడు

9. చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన హర్బజన్ సింగ్ 150 వికెట్లు తీశాడు

10. ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన జస్ప్రీత్ బుమ్రా 145 వికెట్లు పడగొట్టాడు

IPL: 2013లో పూణేపై క్రిస్ గేల్ అత్యధిక స్కోరు… ఇప్పటివరకు ఆ రికార్డు చెక్కుచెదరలేదు.. టాప్-10 బ్యాటర్లు వీరే..