Jio IPL Plans 2022 : ఐపీఎల్ 2022 కోసం జియో సరికొత్త ప్లాన్.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ చూడొచ్చు..!
Jio IPL Plans 2022 : ఐపీఎల్ 2022కు సమయం ఆసన్నమైంది. మార్చి 26 నుంచి ఐపీఎల్ మెగా సీజన్ సందడి మొదలు కాబోతోంది. ఐపీఎల్ ప్రాంచైజీ జట్లు తొలి సీజన్ ఆరంభ మ్యాచ్‌కు రెడీ అవుతున్నాయి.

Reliance Jio Adds New Rs 259 Cricket Add On Prepaid Plan With Disney+ Hotstar
Jio IPL Plans 2022 : ఐపీఎల్ 2022కు సమయం ఆసన్నమైంది. మార్చి 26 నుంచి ఐపీఎల్ మెగా సీజన్ సందడి మొదలు కాబోతోంది. ఐపీఎల్ ప్రాంచైజీ జట్లు తొలి సీజన్ ఆరంభ మ్యాచ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి. ఐపీఎల్ క్రికెట్ అభిమానులు కూడా తమ అభిమాన జట్టు మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ క్రికెట్ ఓటీటీలో వీక్షించే జియో యూజర్ల కోసం దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ యాడ్ ఆన్ ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా రిలయన్స్ జియో యూజర్లకు ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాక్సస్ అందిస్తోంది. రిలయన్స్ జియో డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌కు యాక్సెస్‌ను పొందాలంటే కొత్త రూ.279 క్రికెట్ యాడ్-ఆన్ ప్రీపెయిడ్ ప్లాన్ యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. Jio నుంచి వచ్చిన ఈ కొత్త రీఛార్జ్ ప్యాక్‌లో వాయిస్ కాల్ బెనిఫిట్స్ లేవు. యూజర్లు డేటాతో పాటు OTT సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. ఈ ప్రీపెయిడ్ జియో యాడ్ ఆన్ ప్రీపెయిడ్ ప్లాన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం..
జియో రూ. 279 క్రికెట్ యాడ్-ఆన్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ :
రిలయన్స్ జియో అందించే ఈ కొత్త రూ.279 క్రికెట్ యాడ్-ఆన్ ప్రీపెయిడ్ ప్లాన్.. ఏడాదివరకు డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ (Disney+ Hotstar Mobile subscription) అందిస్తుంది. ఈ ప్లాన్ కింద మొత్తంగా 15GB వరకు హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. మీరు ఈ ప్లాన్‌ని కొనుగోలు చేసిన తర్వాత.. మీ ప్రస్తుత ప్రీపెయిడ్ ప్లాన్ గడువు ముగిసే వరకు ఈ వ్యాలిడిటీ ఉంటుంది. జియో ఈ క్రికెట్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందరికీ అందించడం లేదు. అది కూడా రిలయన్స్ జియో ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ కు అర్హత కలిగిన కొంతమంది జియో యూజర్లకు నోటిఫికేషన్‌ను పంపుతోంది. ఒకవేళ మీరూ అర్హత పొందారో లేదో చెక్ చేసుకోవాలంటే జియో MyJio యాప్‌లో ప్లాన్ లో చెక్ చేసుకోవచ్చు.

Reliance Jio Adds New Rs 279 Cricket Add On Prepaid Plan With Disney+ Hotstar
ఇతర జియో ప్లాన్లు ఇవే :
జియో యూజర్ల అందరికి ఈ కొత్త యాడ్ ఆన్ ప్రీపెయిడ్ ప్లాన్ అందుబాటులో ఉండకపోవచ్చు. అందుకే మీరు రూ. 499 ప్రీపెయిడ్ జియో ప్లాన్ తీసుకోవచ్చు. జియో అందించే క్రికెట్ ప్లాన్లలో ఇదే చాలా తక్కువ.. అంతేకాదు.. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMS 2GB రోజువారీ డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీ వ్యవధితో వస్తుంది. ఒక ఏడాది డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ అందిస్తోంది. ఈ ప్లాన్ కొనుగోలుపై, 20 శాతం JioMart డిస్కౌంట్ ఆఫర్ కూడా అందిస్తోంది. కంపెనీ JioMart సర్వీసు ద్వారా మీరు కొనుగోలు చేసే వస్తువులపై 20 శాతం తగ్గింపును పొందవచ్చు. మొబైల్ నంబర్‌ను రీఛార్జ్ చేయాలనకుంటే.. IPL క్రికెట్ మ్యాచ్‌లను చూడొచ్చు.
ఒకవేళ అదనపు డేటా పొందాలంటే.. Jio నుంచి డేటా వోచర్లను పొందవచ్చు. రూ.121 4G డేటా వోచర్ ఉంది. 12GB డేటాను అందిస్తుంది. మీ ప్రస్తుత ప్లాన్ వరకు వ్యాలిడిటీలో ఉంటుంది. ఎక్కువ డేటా అవసరం లేని యూజర్లు రూ. 25 లేదా రూ. 61 జియో ప్రీపెయిడ్ ప్లాన్ ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్లలో వరుసగా 2GB, 6GB డేటాను అందిస్తాయి. మీకు వ్యాలిడిటీతో కూడిన డేటా వోచర్లు అవసరమైతే.. వర్క్ ఫ్రమ్ హోమ్” ప్లాన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిలో చౌకైన ప్లాన్ రూ. 181 ప్రీపెయిడ్ డేటా ప్లాన్.. 30GB డేటాతో వస్తుంది. ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు అన్నీ MyJio యాప్‌లోనూ ఆన్లైన్ Jio సైట్లో అందుబాటులో ఉన్నాయి.
Read Also : Jio Plan : జియో మరో సంచలనం.. ఒక్క రూపాయికే.. 30 రోజుల వ్యాలిడిటీ