KA Paul: సోదరుడి హత్య కేసులో సుప్రీం కోర్టుకు కేఏ పాల్.. తనను అరెస్టు చేయకుండా స్టే విధించాలని పిటిషన్

తన సోదరుడి హత్య కేసులో అరెస్టుపై స్టే పొడిగించాలని పాల్ తన పిటిషన్‌లో కోరారు. అలాగే ఇటీవల తెలంగాణలో నూతనంగా నిర్మించిన సచివాలయంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మీడియాతో మాట్లాడారు.

KA Paul: సోదరుడి హత్య కేసులో సుప్రీం కోర్టుకు కేఏ పాల్.. తనను అరెస్టు చేయకుండా స్టే విధించాలని పిటిషన్

KA Paul: తన సోదరుడి హత్య కేసుతోపాటు, తెలంగాణ సచివాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం అంశాలపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తన సోదరుడి హత్య కేసులో అరెస్టుపై స్టే పొడిగించాలని పాల్ తన పిటిషన్‌లో కోరారు.

Revanth Reddy: ఇసుక మాఫియాలో కేసీఆర్ కుటుంబ భాగస్వామ్యం.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపణ

అలాగే ఇటీవల తెలంగాణలో నూతనంగా నిర్మించిన సచివాలయంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మీడియాతో మాట్లాడారు. ‘‘మా అన్న హత్య కేసులో మార్చి 6న నన్ను అరెస్ట్ చేసి, చంపడానికి కేసీఆర్ కుట్ర పన్నారు. నేను అక్రమాలు చేయలేదు. కేసీఆర్‌ను నిలదీస్తున్నందుకే నన్ను అరెస్టు చేయాలని చూస్తున్నారు. నన్ను అక్రమంగా అరెస్టు చేయాలని చూస్తున్న కేసీఆర్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించా. నా అరెస్టుపై ఇచ్చిన స్టేను వ్యతిరేకిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశా.

BRS Party: బీఆర్ఎస్ యూపీ జనరల్ సెక్రెటరీగా తివారీ.. మహారాష్ట్ర డివిజన్ కో-ఆర్డినేటర్లను ప్రకటించిన కేసీఆర్

ఏప్రిల్ 6 వరకు లేదా మార్చి 30 వరకు హైకోర్టు నా అరెస్టుపై ఇచ్చిన స్టేను పొడిగించాలని సుప్రీంకోర్టును కోరా. నా సోదరుడి హత్య కేసులో అనేక సార్లు విచారణకి హాజరయ్యా. సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతుంది కాబట్టి సమయం కోరుతున్నా. నాపై కుట్ర పన్నితే దేవుడు, ప్రజలు క్షమించరు. ఎమ్మెల్యేల ఎర కేసులో ఆధారాలు పెన్ డ్రైవ్‌లో పెట్టి అందరికీ పంచుతారా? ప్రధాని, న్యాయమూర్తి కంటే కేసీఆర్ పెద్దవారా? పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు’’ అని కేఏ పాల్ వ్యాఖ్యానించారు.