Kajal – Gautam Kitchlu : చిరు ఆశీస్సులందుకున్న కాజల్, గౌతమ్..

చిరు.. కాజల్, గౌతమ్‌లకు అభినందనలు తెలిపి, బ్లెస్సింగ్స్ అందజేశారు..

Kajal – Gautam Kitchlu : చిరు ఆశీస్సులందుకున్న కాజల్, గౌతమ్..

Updated On : June 22, 2021 / 2:45 PM IST

Kajal – Gautam Kitchlu: మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ఫిలిం..‘ఆచార్య’.. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై నిరంజన్ రెడ్డి, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడ్డ ‘ఆచార్య’ షూటింగ్ ఇటీవలే పున:ప్రారంభమైంది.

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కీలకపాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో చిరు పక్కన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఇటీవలే ప్రియుడు గౌతమ్ కిచ్లుని పెళ్లాడి.. హనీమూన్ కోసం మాల్దీవులకెళ్లి కాజల్ ఎంత సందడి చేసిందో చూశాం.

తాజాగా ఈ కొత్త జంటను చిరు ఆశీర్వదించారు. ఈ రోజు నుండ కాజల్ ‘ఆచార్య’ షూటింగ్‌లో జాయిన్ అయింది. ఈ సందర్భంగా చిరు.. కాజల్, గౌతమ్‌లకు అభినందనలు తెలిపి, బ్లెస్సింగ్స్ అందజేశారు. కాజల్, గౌతమ్ దండలు మార్చుకుని, కేక్ కట్ చేశారు. ‘ఆచార్య’ టీమ్ అందరూ న్యూ కపుల్‌కి విషెష్ తెలియజేశారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరప్రాంతాల్లో ‘ఆచార్య’ చిత్రీకరణ జరుపుకుంటోంది.

Kajal - Gautam Kitchlu

Kajal - Gautam Kitchlu

Kajal - Gautam Kitchlu