Language War : నా మాతృభాష తమిళ్‌కి అడ్డు పడితే ఊరుకోను.. కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు..

కమల్ హాసన్ మాట్లాడుతూ.. ''నేను హిందీని వ్యతిరేకించను, కానీ నా మాతృభాష తమిళ్ కి అడ్డుపడితే మాత్రం ఊరుకోను. దాని కోసం ఎంతవరకు అయినా...................

Language War : నా మాతృభాష తమిళ్‌కి అడ్డు పడితే ఊరుకోను.. కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు..

Kamal Haasan

Kamal Haasan :  ఇటీవల భాషా వివాదం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. హిందీ వర్సెస్ ప్రాంతీయ భాషలు అన్నట్టు ఈ వివాదం చాలా రోజుల నుంచి సాగుతుంది. ఇక తమిళనాడులో అయితే హిందీ వర్సెస్ తమిళ్ అని కొన్ని సంవత్సరాలుగా సాగుతుంది. అక్కడి ప్రజలు తమిళ భాషపై ప్రేమతో హిందీ భాషని వ్యతిరేకిస్తూ హిందీ నేర్చుకోండి, మాట్లాడండి అని చెప్పే వాళ్ళని విమర్శిస్తున్నారు.

ఇక స్టార్ హీరో కమల్ హాసన్ మొదటి నుంచి కేంద్రాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. హిందీ భాషని వ్యతిరేకిస్తూ గతంలో కూడా పలు మార్లు కామెంట్స్ చేశారు. తాజాగా కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరగగా ఈ ఈవెంట్లో కమల్ హాసన్ మాట్లాడుతూ.. ”నేను హిందీని వ్యతిరేకించను, కానీ నా మాతృభాష తమిళ్ కి అడ్డుపడితే మాత్రం ఊరుకోను. దాని కోసం ఎంతవరకు అయినా పోరాడతాను. చిన్నతనంలో నా తొలి గురువు శివాజీ గణేషన్‌ ఇంటికి ఎక్కువగా వెళుతుండే వాడిని, నా రెండో గురువు గీత రచయిత వాలి. వారి వల్లే నేనిక్కడ ఇలా మాట్లాడుతున్నాను. తమిళం వర్థిల్లాలి అని చెప్పడం నా బాధ్యత. దీనికి ఎవరు అడ్డు వచ్చినా ఎదుర్కుంటాను. ఇప్పుడు భాష గురించి చర్చ జరుగుతోంది కాబట్టి చెబుతున్నాను మాతృభాషను మరవకండి. అలా అని హిందీకి వ్యతిరేకినని చెప్పను, అన్ని భాషలూ ఒకటే. అందరూ కలిస్తేనే ఇండియా” అని తెలిపారు.

Latha Bhagawan Khare : 65 ఏళ్ళ మహిళ జీవితంపై మరాఠీలో బయోపిక్.. త్వరలో పాన్ ఇండియా సినిమాగా రీమేక్..

అయితే కమల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదానికి దారి తీశాయి. తమిళ ప్రజలు ఈ వ్యాఖ్యలని సమర్దిస్తుంటే హిందీ మాట్లాడే వాళ్ళు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. దీంతో మళ్ళీ భాషా వివాదానికి తెరతీశారు.