Kapata Nataka Sutradhari : కోన వెంకట్ రిలీజ్ చేసిన ‘కపటనాటక సూత్రధారి’ ఫస్ట్‌లుక్..

వెరైటీ కాన్సెప్ట్‌తో సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘కపటనాటక సూత్రధారి’.. విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందులాల్, మాస్టర్ బాబా ఆహిల్, అమీక్ష, సునీత, భానుచందర్, రవిప్రకాష్, అరవింద్, మేక రామకృష్ణ, విజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు..

Kapata Nataka Sutradhari :  కోన వెంకట్ రిలీజ్ చేసిన ‘కపటనాటక సూత్రధారి’ ఫస్ట్‌లుక్..

Kapata Nataka Sutradhari

Updated On : April 14, 2021 / 8:07 PM IST

Kapata Nataka Sutradhari: వెరైటీ కాన్సెప్ట్‌తో సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘కపటనాటక సూత్రధారి’.. విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందులాల్, మాస్టర్ బాబా ఆహిల్, అమీక్ష, సునీత, భానుచందర్, రవిప్రకాష్, అరవింద్, మేక రామకృష్ణ, విజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మనీష్ (హలీమ్) నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి క్రాంతి సైనా దర్శకత్వం వహించారు.

Kapata Nataka Sutradhari
ఉమా శంకర్, వెంకట రామరాజు, శరత్ కుమార్, జగదీశ్వర్ రావు, శేషు కుమార్, ఎండి హుస్సేన్ సహ నిర్మాతలు.. సుభాష్ దొంతి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా రామ్ తవ్వా సంగీతం సమకూరుస్తున్నారు. రామకృష్ణ మాటలు అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను ప్రముఖ రచయిత కోన వెంకట్ రిలీజ్ చేశారు.

Kapata Nataka Sutradhari

ఈ సందర్భంగా కోన వెంకట్ మాట్లాడుతూ.. ‘‘ఫస్ట్‌లుక్ పోస్టర్ ఎంతో విభిన్నంగా ఉంది.. చూస్తుంటే ఎంతో వైవిధ్యభరితమైన సినిమా అని తెలుస్తుంది. పోస్టర్ చూస్తుంటేనే సినిమా చూడాలని ఆసక్తి పెరుగుతుంది.. సినిమా చాలా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్’’.. అన్నారు..

నటీనటులు….
విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందులాల్, మాస్టర్ బాబా ఆహిల్, అమీక్ష, సునీత, భానుచందర్, రవిప్రకాశ్, అరవింద్,మేక రామకృష్ణ,విజయ్

సాంకేతిక నిపుణులు….
డ్యాన్స్ : జిత్తు మాస్టర్
ఎడిటర్ : ఛోటా కె ప్రసాద్
సంగీతం : రామ్ తవ్వా
నేపథ్య సంగీతం : వికాస్ బడిస
సినిమాటోగ్రఫీ : సుభాష్ దొంతి
మాటలు : రామకృష్ణ
దర్శకుడు : క్రాంతి సైనా
సహా నిర్మాతలు : ఉమా శంకర్, వెంకటరామరాజు, శరత్ కుమార్, జగదీశ్వర్ రావు, శేషు కుమార్, ఎండి హుస్సేన్, నిర్మాత : మనీష్ (హలీమ్)..