Karnataka CM : ఆడియో క్లిప్‌ కలకలం: ‘జూలై 26న కర్ణాటక సీఎం మార్పు’

కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారుతున్న సంగతి తెలిసిందే.. బీఎస్ యడియూరప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పిస్తున్నారంటూ వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన యడియూరప్ప కేంద్ర పెద్దలను కలిశారు. ఈ సందర్బంగా ఆయన రాజీనామా ప్రస్తావన వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇక ఈ వార్తలకు బలం చేకూరే విధంగా కర్ణాటకలో ఓ ఆడియో క్లిప్ చక్కర్లు కొడుతోంది.

Karnataka CM : ఆడియో క్లిప్‌ కలకలం: ‘జూలై 26న కర్ణాటక సీఎం మార్పు’

Karnataka Cm

Karnataka CM :  కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారుతున్న సంగతి తెలిసిందే.. బీఎస్ యడియూరప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పిస్తున్నారంటూ వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన యడియూరప్ప కేంద్ర పెద్దలను కలిశారు. ఈ సందర్బంగా ఆయన రాజీనామా ప్రస్తావన వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇక ఈ వార్తలకు బలం చేకూరే విధంగా కర్ణాటకలో ఓ ఆడియో క్లిప్ చక్కర్లు కొడుతోంది.

కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు నలిన్ కుమార్ కతీల్‌దిగా భావిస్తున్న ఈ ఆడియో ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 47 సెకండ్లపాటు ఉన్న ఈ ఆడియో క్లిప్ లో కతిల్‌గా భావిస్తున్న వ్యక్తి మరొకరితో తులు భాషలో మాట్లాడుతున్నారు. దీనిని ఎవరి చెప్పవద్దు. మేము ఈశ్వరప్ప, షెట్టర్ బృందాన్ని తొలగిస్తాము, ఆ స్థానంలో కొత్త బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాము.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంతా కంట్రోల్ లోనే ఉందంటూ కతిల్‌ గా భావిస్తున్న వ్యక్తి మాట్లాడారు.

ఇక ఇదిలా ఉంటే యడియూరప్ప జూలై 26న తన పదవికి రాజీనామా చేస్తారని కర్ణాటక వ్యక్తంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే రోజు కర్ణాటక ఎమ్మెల్యేలు కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఇక ఇదే విషయంపై గత వారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సమయంలో యడియూరప్ప మీడియాతో మాట్లాడారు. తనను కేంద్ర పెద్దలు సీఎంగా కొనసాగాలని కోరారని తెలిపారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నారు.

ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డాలను కలిశానని.. తమ మధ్య అసలు రాజీనామా ప్రస్తావనే రాలేదని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి.. కొత్త ప్రాజెక్టుల నిర్మాణంపై చర్చించామని తెలిపారు. కాగా 2023లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే 79 ఏళ్ల యడియూరప్పని తప్పించి యువనాయకుడికి ముఖ్యమంత్రి పదవి అప్పగించాలని రాష్ట్రంలోని కొందరు నేతలు కోరుతున్నట్లు తెలుస్తుంది. కేంద్ర పెద్దలు కూడా యడియూరప్పను తప్పించాలని చూస్తున్నట్లుగా సమాచారం.

మరోవైపు వైరల్‌ ఆడియోపై కతీల్‌ స్పందించారు. ఇది ఫేక్‌ ఆడియో క్లిప్‌, పార్టీలో కలహాలు సృష్టించడం కోసం ఎవరో నా గొంతును అనుకరించారు. దీనిపై సీఎం లోతైన దర్యాప్తు చేయాలని కోరానని అన్నారు.