Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం అన్నయ్య మృతి..

హీరో కిరణ్ అబ్బవరం సోదరుడు రామాంజులు రెడ్డి మరణించారు..

Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం అన్నయ్య మృతి..

Kiran Abbavaram Brother

Updated On : December 1, 2021 / 1:19 PM IST

Kiran Abbavaram: సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్, ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి వంటి సినీ లెజెండ్స్ మరణించారనే వార్త ఇంకా జీర్ణించుకోలేకపోతుండగా.. ఇంతలో మరో షాకింగ్ న్యూస్ రావడంతో టాలీవుడ్ వర్గాల వారు ఆందోళనకు గురవుతున్నారు.

Pawan Kalyan : సిరివెన్నెల మ‌ర‌ణం తెలుగు సాహిత్యానికి, చిత్రసీమకు తీర‌ని లోటు

రాజావారు రాణిగారు, ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ కమ్ రైటర్ కిరణ్ అబ్బవరం ఇంట విషాదం నెలకొంది. కిరణ్ అన్నయ్య రామాంజులు రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

Kiran Abbavaram : మైత్రీ మూవీస్‌లో కిరణ్ అబ్బవరం క్రేజీ మూవీ..

కడప జిల్లాలోని చెన్నూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రామాంజులు రెడ్డి కన్నుమూశారు. దీంతో కిరణ్ అబ్బవరం కుటుంబంతో పాటు సినీ పరిశ్రమలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. రామాంజులు రెడ్డి సంబేపల్లో మండలం దుద్యాల గ్రామంలో నివసిస్తున్నారు. ఈ వార్త తెలియగానే కిరణ్ అబ్బవరం సొంతూరికి బయలుదేరి వెళ్లారు.

S. S. Rajamouli : రాజమౌళి కోరిక తీర్చకుండానే వెళ్ళిపోయిన సిరివెన్నెల