డిఫరెంట్ పాయింట్‌తో ‘మధుబాల’

డిఫరెంట్ పాయింట్‌తో ‘మధుబాల’

Madhubala: సినిమా పరిశ్రమలో ప్రతిభ, ఆసక్తి ఉన్నవారికి ఓటీటీలు వరాలుగా మారాయి.. ఎంతోమంది నటీనటులు, టెక్నీషియన్స్ తమ టాలెంట్ ద్వారా గుర్తింపు దక్కించుకుంటున్నారు. ఆ కోవలో ‘రొమాంటిక్ పెళ్లిచూపులు’ అనే డిఫరెంట్ షార్ట్‌ఫిలింతో నెటిజన్లను ఆకట్టుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ చిరంజీవి దాసరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వైవిధ్య భరితమైన వెబ్ ఫిలిం.. ‘మధుబాల’..

Madhubala

సాహితి దాసరి, నిషాంత్ ప్రధాన పాత్రల్లో.. శ్రీ చైతన్య ఆర్ట్ ఫిల్మ్స్ బ్యానర్ మీద కృష్ణ చైతన్య, చిరంజీవి దాసరి కలిసి నిర్మిస్తున్న ‘మధుబాల’ ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. డిఫరెంట్ పాయింట్‌తో రూపొందుతున్న ‘మధుబాల’ ప్రేక్షకులను అలరిస్తుందని మూవీ టీమ్ తెలిపారు.

Madhubala

Madhubala

సాయి తేజ, నవనీత్, నాగరాజ్, సంధ్య, నిధి, మౌల్య, మంజు తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ మూవీకి డైలాగ్స్ : వై.చంద్ర శేఖర్, సినిమాటోగ్రఫీ : కిరణ్ దాసరి, ఎడిటింగ్ : గణేష్ కొమ్మారపు, మ్యూజిక్ : సుమన్ వంకర – నరసింహా తోటపల్లి, పబ్లిసిటీ డిజైనర్ : వేణు కుప్పిలి, మేకప్ : వంశీ వరాల, ప్రొడ్యూసర్స్ : కృష్ణ చైతన్య, చిరంజీవి దాసరి, స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ : చిరంజీవి దాసరి.

Madhubala