Pakistan: పాకిస్థాన్‌లో మహారాజా రంజిత్ సింగ్ విగ్రహం ధ్వంసం

పాకిస్థాన్‌ లాహోర్ ఫోర్ట్ కాంప్లెక్స్‌లోని మహారాజా రంజిత్ సింగ్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనలో పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.

Pakistan: పాకిస్థాన్‌లో మహారాజా రంజిత్ సింగ్ విగ్రహం ధ్వంసం

Pakistan

Pakistan: పాకిస్థాన్‌ లాహోర్ ఫోర్ట్ కాంప్లెక్స్‌లోని మహారాజా రంజిత్ సింగ్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనలో పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. పాక్ లోని మహారాజా రంజిత్ సింగ్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఇది మూడవసారి. సిక్కు సామ్రాజ్యంలో మొట్టమొదటి మహారాజు అయిన సింగ్ పంజాబ్‌ని దాదాపు 40 సంవత్సరాలు పరిపాలించాడు. అతను 1839లో మరణించాడు. మహారాజా 180వ వర్ధంతి సందర్భంగా 2019లో లాహోర్ ఫోర్ట్ కాంప్లెక్స్‌లో మహారాజా రంజిత్ సింగ్ తొమ్మిది అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ విగ్రహం రంజిత్ సింగ్ గుర్రంపై కూర్చొని, చేతిలో ఖడ్గం, సిక్కు వేషధారణలో కనిపిస్తుంది. చేతిలో ఖడ్గంతో తన ఇష్టమైన గుర్రంపై కూర్చున్న సిక్కు పాలకుడి విగ్రహాన్ని పూర్తి చేయడానికి ఎనిమిది నెలలు పట్టగా.. ఈ గుర్రం బరాజ్‌కాయ్ రాజవంశ స్థాపకుడు దోస్త్ ముహమ్మద్ ఖాన్ బహుమతి. ఈ విగ్రహాన్ని వాల్డ్ సిటీ ఆఫ్ లాహోర్ అథారిటీ (WCLA) యూకే ఆధారిత సిక్కు హెరిటేజ్ ఫౌండేషన్ సహకారంతో నిర్మించారు.

రంజిత్ సింగ్ విగ్రహం ఆవిష్కరించబడిన రెండు నెలల తర్వాత తెహ్రీక్-ఇ-లబ్బైక్ యొక్క ఇద్దరు సభ్యులు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనలో అప్పుడు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఒకరు వికలాంగుడు కాగా రెండో వ్యక్తి అతనికి సహాయకుడిగా కోటలోకి ప్రవేశించారు. కాళ్ళ వైకల్యం ఉన్నట్లు నటించిన ఆ వ్యక్తి విగ్రహాన్ని తన వద్ద ఉన్న రాడ్‌తో కొట్టగా.. రెండో వ్యక్తి అతనికి సహాయం చేశాడు. ఈ దాడిలో విగ్రహం ఒక చేయి, ఇతర భాగాలు విరిగిపోయాయి.

ఇక ఇప్పుడు లాహోర్‌లోని మహారాజా రంజిత్ సింగ్ విగ్రహాన్ని మంగళవారం తెహ్రీక్-ఇ-లబ్బైక్ పాకిస్తాన్ సభ్యులు ధ్వంసం చేశారు. ఈ చర్యకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముస్లిం దేశంలో సిక్కు పాలకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తమ మతానికి విరుద్ధమని భావించే మత సంస్థ తెహ్రీక్-ఇ-లబ్బైక్ సభ్యులు ఈ దాడికి పాల్పడుతున్నారు.