Manoj Vs Vishnu : మనోజ్ తనకి ఆ అధికారం వద్దని విష్ణుకే ఇచ్చేయమన్నాడు.. మోహన్ బాబు!
మంచు విష్ణు (Manchu Vishnu), మనోజ్ (Manchu Manoj) గొడవ గురించి మోహన్ బాబు (Mohan Babu) తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో స్పందించాడు. ఈ క్రమంలోనే మోహన్ బాబు..

Mohan Babu about Manchu vishnu and Manoj conflict
Manoj Vs Vishnu : ఇటీవల మంచు విష్ణు (Manchu Vishnu), మనోజ్ (Manchu Manoj) మధ్య జరిగిన గొడవ ఒకటి బయటికి రావడం, రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించడం అందరికి తెలిసిందే. విబేధాలకు గల కారణాలు ఏంటనేది తెలియనప్పటికీ, ఆ వీడియోని మనోజ్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయడం అనేది ప్రతి ఒకర్ని షాక్ కి గురి చేసింది. ఇక ఈ గొడవ గురించి ఇప్పటి వరకు మంచు కుటుంబంలోని ఇతర సభ్యులు ఎవరు నోరు విప్పలేదు. తాజాగా దీని పై మోహన్ బాబు (Mohan Babu) ఒక ఇంటర్వ్యూలో స్పందించాడు.
అన్నదమ్ములు మధ్య మనస్పర్థలు రావడం సహజమే. అయితే ఆవేశాలకు పోయి చేసే కొన్ని పనులు బాధని కలిగిస్తాయి అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే మోహన్ బాబు యూనివర్సిటీ ఏర్పడానికి గల ముఖ్య కారణం మంచు విష్ణు అని చెప్పుకొచ్చాడు. దాదాపు 12 ఏళ్ళ పాటు కంప్లీట్ ఫోకస్ ఇన్‌స్టిట్యూషన్స్ పై పెట్టి మొత్తం తానై చూసుకున్నాడు. నేడు ఇంతవరకు తీసుకు వచ్చాడు. మనోజ్ ఇన్‌స్టిట్యూషన్స్ బాధ్యతలు తనకి వద్దన్నాడు. తాను సినిమాల్లో ఉంటాను, ఆ అధికారం అన్నయ్యకే (విష్ణు) ఇచ్చేమని చెప్పాడు అంటూ వెల్లడించాడు.
ఇది ఇలా ఉంటే, తాజాగా మంచు విష్ణు కూడా ఈ గొడవ గురించి ఒక వీడియో పోస్ట్ వేశాడు. ఈ గొడవ ఒక రియాలిటీ షో అని, త్వరలోనే స్ట్రీమ్ కాబోతుందని, హౌస్ ఆఫ్ మంచుస్ (House of Manchus) అనే టైటిల్ ని కూడా అనౌన్స్ చేశాడు. ఇక ఈ వీడియో చూసిన నెటిజెన్లు మంచు కుటుంబంలో అసలు ఏమి జరుగుతుందో అర్ధంకాక తికమక పడుతున్నారు. మరి అసలు విషయం తెలియాలి అంటే కొన్నిరోజులు ఎదురు చూడాల్సిందే.