Most Eligible Bachelor: మళ్ళీ వెనక్కి వెళ్లిన బ్యాచిలర్! రిలీజ్ ఎప్పుడంటే..?

చాలా కాలంగా హీరోగా తానేంటో ప్రూవ్ చేసుకోవాలని తపన పడుతున్నాడు అఖిల్ అక్కినేని. కెరీర్ ఆరంభంలోనే తడబాటుతో తప్పులను దిద్దుకుంటూ తనని తాను మలచుకుంటున్న అఖిల్ ఆశలన్నీ..

Most Eligible Bachelor: మళ్ళీ వెనక్కి వెళ్లిన బ్యాచిలర్! రిలీజ్ ఎప్పుడంటే..?

Most Eligible Bachelor

Updated On : September 26, 2021 / 4:07 PM IST

Most Eligible Bachelor: చాలా కాలంగా హీరోగా తానేంటో ప్రూవ్ చేసుకోవాలని తపన పడుతున్నాడు అఖిల్ అక్కినేని. కెరీర్ ఆరంభంలోనే తడబాటుతో తప్పులను దిద్దుకుంటూ తనని తాను మలచుకుంటున్న అఖిల్ ఆశలన్నీ ఇప్పుడు రాబోయే రెండు సినిమాలపైనే ఉన్నాయి. సక్సెస్ హీరోయిన్ పూజాహెగ్డేతో కలిసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ గా రావాలని చూస్తున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కించిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్.

Pawan-Mahesh: పవన్ స్పీచ్.. మహేష్ ట్వీట్ వైరల్!

నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తుండగా ఈ మధ్యనే దసరా కానుకగా సినిమాను తీసుకొచ్చేందుకు ఫిక్స్ అయ్యారు. ఈ సినిమాను అక్టోబర్ 8వ తేదీన విడుదల చేయనున్నట్టు ఇదివరకే చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు మేకర్స్ నుంచి మరో సరికొత్త రిలీజ్ డేట్ ఇప్పుడు వచ్చింది. ఈ సినిమాని ఇంకో వారం ముందుకు తీసుకెళ్లి అక్టోబర్ రెండో వారానికి షిఫ్ట్ చేసి అక్టోబర్ 15న విడుదల చేస్తామని పోస్టర్ కూడా వదిలారు.

Akhil Akkineni: ఏజెంట్ లోడింగ్.. మైండ్ బ్లాంక్ చేసే పోస్టర్!

ఈ సినిమా గోపి సుందర్ సంగీతం అందివ్వగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మించారు. కాగా, అఖిల్ బ్యాచలర్ సినిమాతో పాటు స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు అఖిల్ మరో కోణాన్ని చూపించగా ఈ అక్కినేని హీరో ఈ రెండు సినిమాల మీదనే ఆశలు పెట్టుకున్నాడు.