Omicron Variant : మనిషి చర్మంపై 21గంటలు.. ప్లాస్టిక్‌పై 8రోజులు జీవిస్తున్న ఒమిక్రాన్‌

మనిషి శరీరంలో కాకుండా బయట పరిసరాల్లో కొవిడ్‌ 19, ఇతర కొత్త వేరియంట్లు ఎంత కాలంపాటు జీవించి ఉంటాయనే అంశాన్ని విశ్లేషించిన పరిశోధకుల బృందం పలు అంశాలను గుర్తించింది.

Omicron Variant : మనిషి చర్మంపై 21గంటలు.. ప్లాస్టిక్‌పై 8రోజులు జీవిస్తున్న ఒమిక్రాన్‌

Omicron Live

Updated On : January 27, 2022 / 7:46 AM IST

omicron variant live on human skin : కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఎన్నిగంటల పాటు పర్యావరణంలో జీవించి ఉంటుందనే అంశంపై జపాన్‌కు చెందిన పరిశోధకుల అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. మనిషి చర్మంపై ఒమిక్రాన్‌ వేరియంట్‌ 21గంటల పాటు సజీవంగా ఉంటుందనీ.. అదే ప్లాస్టిక్‌ ఉపరితలంపైన దాదాపు 8 రోజుల పాటు జీవించి ఉంటుందని క్యోటో ప్రీఫెక్చురల్ యూనివర్సిటీ ఆఫ్‌ మెడిసిన్ పరిశోధకుల బృందం గుర్తించింది. ఒమిక్రాన్‌ ఒకరి నుంచి మరొకరికి శరవేగంగా వ్యాప్తి చెందడానికి కారణం కూడా ఇదేనని తెలిపింది.

మనిషి శరీరంలో కాకుండా బయట పరిసరాల్లో కొవిడ్‌ 19, ఇతర కొత్త వేరియంట్లు ఎంత కాలంపాటు జీవించి ఉంటాయనే అంశాన్ని విశ్లేషించిన పరిశోధకుల బృందం పలు అంశాలను గుర్తించింది. ఆల్ఫా, బీటా, డెల్టా, ఒమిక్రాన్‌ వేరియంట్లు కొవిడ్ 19తో పోలిస్తే రెండు రెట్ల కన్నా అధికంగా చర్మం, ప్లాస్టిక్‌పై జీవించగలవని పేర్కొంది. అత్యధిక పర్యావరణ స్థిరత్వాన్ని కలిగి ఉండటం వల్లే ఈ వేరియంట్లతో ఎక్కువ వ్యాప్తి జరిగినట్టు తెలిపారు.

Omicron Patient : ఒమిక్రాన్‌ పేషెంట్లకు డెల్టా వేరియంట్ సహా ఇతర హానికారక వేరియంట్లను నాశనం చేసే శక్తి

ఇతర వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్‌ అత్యధిక పర్యావరణ స్థిరత్వాన్ని కలిగి ఉందని.. అందువల్లే డెల్టా రకంతో పోలిస్తే శరవేగంగా వ్యాప్తి జరుగుతున్నట్టు గుర్తించారు. తగిన సాంద్రత కలిగిన ఆల్కాహాల్‌తో తయారైన శానిటైజర్‌తో చేతుల్ని శుభ్రం చేసుకుంటే 15 సెకన్లలోనే వైరస్‌ అంతమవుతుందని తెలిపారు. అందువల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినట్టు శానిటైజర్లతో చేతుల్ని శుభ్రం చేసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.