Orange Re Release : జనసేన కోసం చరణ్ బర్త్ డేకి ఆరెంజ్ రీ రిలీజ్..

ఈ నెల 27న రామ్ చరణ్ బర్త్ డే ఉన్న సంగతి తెలిసిందే. ఆ రోజు 'ఆరెంజ్' మూవీని రీ రిలీజ్ చేయబోతున్నారు అంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాని రీ రిలీజ్ చేయడానికి రంగం సిద్దమైనట్లు సమాచారం.

Orange Re Release : జనసేన కోసం చరణ్ బర్త్ డేకి ఆరెంజ్ రీ రిలీజ్..

Orange Re Release collections donated to janasena party fund

Updated On : March 17, 2023 / 11:05 AM IST

Orange Re Release : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ RRR చిత్రంతో నేషనల్ వైడ్ లోనే కాదు ఇంటర్నేషనల్ లెవెల్ కూడా ఎంతో పాపులారిటీని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఇండియాలో టాప్ స్టార్ గా పలు గౌరవాలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే నేడు, రేపు (మార్చి 17, 18) జరగబోయే ఇండియా బిగ్గెస్ట్ స్పీకర్ షిప్ సమ్మిట్ India Today Conclave ప్రోగ్రాంలో ప్రధాని నరేంద్ర మోదీ, సచిన్ తో కలిసి పాల్గొంటున్నాడు. సినీ పరిశ్రమ నుంచి చరణ్ ప్రాతినిధ్యం వహిస్తూ.. సినిమాలు గురించి, RRR ఆస్కార్ గెలుచుకోవడం గురించి మాట్లాడనున్నాడు.

Ram Charan : మోదీతో కలిసి ఇండియా స్పీకర్ షిప్ సమ్మిట్ ప్రోగ్రాంలో మాట్లాడబోతున్న రామ్ చరణ్..

అమెరికాలో ఉన్న చరణ్ ఈరోజు డైరెక్ట్ గా ఢిల్లీకి చేరుకోకున్నాడు. అనంతరం ఈ రెండు రోజులు అక్కడే సమ్మిట్ లో పాల్గొని ఆదివారం హైదరాబాద్ రానున్నాడు. కాగా ఈ నెల 27న రామ్ చరణ్ బర్త్ డే ఉన్న సంగతి తెలిసిందే. ఆ రోజు ‘ఆరెంజ్’ మూవీని రీ రిలీజ్ చేయబోతున్నారు అంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాని రీ రిలీజ్ చేయడానికి రంగం సిద్దమైనట్లు సమాచారం. రీ రిలీజ్ కి వచ్చిన కలెక్షన్స్ అన్ని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఫండ్ కి ఇవ్వనున్నారు.

కాగా ఈ సినిమాలో చరణ్ లవర్ బాయ్ పాత్రలో కనిపించాడు. 2010 లో విడుదలైన ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయినా ఎంతోమందికి ఫేవరెట్ గా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమాలోని సాంగ్స్ అల్ టైం ఫేవరెట్. జెనీలియా హీరోయిన్ గా నటించగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేశాడు. నాగబాబు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాడు. మరి వింటేజ్ రామ్ చరణ్ ని చూడాలి అనుకుంటున్న వారు ఆరంజ్ సినిమాకి వెళ్లి ఎంజాయ్ చేయండి. కాగా అదే రోజు ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న RC15 టైటిల్ అనౌన్స్‌మెంట్ కూడా రానుంది.