Tollywood Industry : తెలుగు పరిశ్రమకు వలస వచ్చేస్తున్నారు..

టాలీవుడ్‌కు బయట ఇండస్ట్రీల నుంచి హీరోల తాకిడి ఎక్కువై పోతోంది. మన హీరోలు పాన్ ఇండియా స్టార్స్‌గా మారిపోతుంటే.. తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెడితేనే పాన్ ఇండియా ఇమేజ్ సాధించవచ్చు అనుకుంటున్నారో ఏమో.. చాలా మంది స్టార్స్ తెలుగు సినిమాల్లో నటించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు..

Tollywood Industry : తెలుగు పరిశ్రమకు వలస వచ్చేస్తున్నారు..

Tollywood Industry

Tollywood Industry: టాలీవుడ్‌కు బయట ఇండస్ట్రీల నుంచి హీరోల తాకిడి ఎక్కువై పోతోంది. మన హీరోలు పాన్ ఇండియా స్టార్స్‌గా మారిపోతుంటే.. తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెడితేనే పాన్ ఇండియా ఇమేజ్ సాధించవచ్చు అనుకుంటున్నారో ఏమో.. చాలా మంది స్టార్స్ తెలుగు సినిమాల్లో నటించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.

తెలుగు సినిమా పరిశ్రమకు ఇతర భాషలహీరోతో ఫ్లోటింగ్ ఎక్కువైపోతుంది. తమిళ్, కన్నడ, మలయాళం నుంచి తెలుగు పరిశ్రమకు హీరోలు వలస వచ్చేస్తున్నారు. టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంటే ఆల్ ఇండియా స్టార్‌ ఇమేజ్ వస్తుందని భావిస్తున్నారు. స్టార్ హీరోల ఆలోచనలు కూడా ఇలానే ఉన్నాయి. రీసెంట్‌గా తమిళ స్టార్ హీరో విజయ్‌తో వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో పాన్ ఇండియా తెలుగు మూవీ కన్ఫర్మ్ అయ్యింది. ఇంత వరకూ మాతృభాష తమిళం నుంచే ఇంత పెద్ద సినిమా చేయలేదు విజయ్. తన ఇమేజ్‌ను పెంచుకోవడానికి టాలీవుడ్ మీద ఆధారపడబోతున్నాడు.

ఇక మలయాళం నుంచి ఎక్కువగా తెలుగు తెరపై మెరవడానికి హీరోలు వస్తున్నారు. మన స్టార్ హీరో బన్నీ అక్కడ మల్లు అర్జున్ పేరుతో భారీ పాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. అదే స్పూర్తితో.. మలయాళంలో యంగ్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఫాహద్ ఫాజిల్ ‘పుష్ప’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ మూవీలో కథను మలుపు తిప్పే ఇంపార్టెంట్ రోల్ చేయబోతున్నాడు ఫాహద్. మరో మలయాళ యంగ్ హీరో దేవ్ మోహన్ కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. గుణశేఖర్ డైరెక్షన్‌లో సమంత శంకుతల పాత్రలో నటించబోతున్న ‘శాకుంతలం’ సినిమాలో దుష్యంతుడి పాత్రలో కనిపించబోతున్నాడు.

Pushpa : ‘పుష్ప’ కోసం ఎవరు ఎంతెంత తీసుకుంటున్నారంటే!..

ఇప్పటికే ‘ఓకే బంగారం’, ‘కనులు కనులను దోచాయంటే’ లాంటి డబ్బింగ్ సినిమాలతో పాటు ‘మహానటి’ వంటి డైరెక్ట్ తెలుగు సినిమా ద్వారా తెలుగు ఆడియన్స్‌లో కూడా ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు మాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో దుల్కర్ సల్మాన్. ఇక ఇక్కడ తన ఫాలోయింగ్‌ను స్ట్రాంగ్ చేసుకుని.. టాలీవుడ్ నుంచి చక్రం తిప్పాలి అని ప్లాన్ వేశాడు. అందుకే తెలుగులో డైరెక్ట్ సినిమా చేయబోతున్నాడు. డిఫరెంట్ సినిమాల డైరెక్టర్ హనురాఘవపూడితో కలిసి సినిమా చేయబోతున్నాడు దుల్కర్. ఇంతకు ముందు ‘జనతా గ్యారేజ్’, ‘భాగమతి’ లాంటి సినిమాలతో టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న ఉన్ని ముకుందన్.. రవితేజ ‘ఖిలాడి’ లోకూడా నటిస్తున్నాడు. వీళ్లే కాదు మరికొంత మంది యంగ్ స్టార్స్ ఇతర భాషల నుంచి టాలీవుడ్‌లో మెరుపులు మెరిపించడానికి రెడీ అవుతున్నారు.