Mens T20 WorldCup 2024 : టీ20 వరల్డ్‌కప్ 2024కి అర్హత సాధించిన పసికూన.. ఎవరో తెలుసా..? ఇంకా 5 బెర్తులు ఖాళీగానే..
వెస్టిండీస్, అమెరికా ఆతిథ్యం ఇస్తున్న 2024 టీ20 ప్రపంచ కప్‌లో 20 జట్లు కప్పుకోసం పోటిపడనున్నాయి. మొదటి రౌండ్‌లో మొత్తం 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించనున్నారు.

Papua New Guinea qualify Mens T20 World Cup
Mens T20 World Cup 2024 : పురుషుల టీ20 ప్రపంచకప్ 2024(Mens T20 World Cup 2024)కి పపువా న్యూ గినియా (Papua New Guinea) అర్హత సాధించింది. వచ్చే ఏడాది వెస్టిండీస్-అమెరికా సంయుక్తంగా నిర్వహించనున్న టీ20 ప్రపంచకప్ కు తూర్పు ఆసియా-పసిఫిక్ క్వాలిఫైయర్ నుంచి పపువా న్యూ గినియా స్థానం దక్కించుకుంది. శుక్రవారం పిలిప్పీన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 100 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
ఎమిని పార్క్ వేదికగా పపువా న్యూ గినియా, పిలిప్పీన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన పపువా న్యూ గినియా టోనీ యురా (61), ఆసద్ వాలా (59), చార్ల్స్ అమిని (53) లు రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన పిలిప్పీన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 129 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ డేనియల్ స్మిత్ 34 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
Sakshi talks about MS Dhoni : ధోని గురించి చెప్పిన సాక్షి.. ఆనందంలో అభిమానులు.. వీడియో వైరల్
తొలిసారి 20 జట్లతో..
వెస్టిండీస్, అమెరికా ఆతిథ్యం ఇస్తున్న 2024 టీ20 ప్రపంచ కప్‌లో 20 జట్లు కప్పుకోసం పోటిపడనున్నాయి. మొదటి రౌండ్‌లో మొత్తం 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించనున్నారు. ఒక్కో గ్రూపులో ఐదు జట్లు ఉంటాయి. ప్రతి గ్రూప్ నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ 8 దశకు అర్హత సాధిస్తాయి. ఇక్కడ 8 జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతీ గ్రూపులో నాలుగు జట్లు ఉంటాయి. ఇక గ్రూపులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్‌కు చేరుకుంటాయి.
అతిథ్య హోదా అమెరికా, వెస్టిండీస్‌లతో పాటు ర్యాంకింగ్స్ ఆధారంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఇండియా, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లతో కలిపి మొత్తం 12 జట్లు అర్హత సాధించాయి. మిగిలిన స్థానాల కోసం క్వాలిఫయర్ టోర్నీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే క్వాలిఫయర్ ద్వారా ఐర్లాండ్, స్కాట్లాండ్‌లు అర్హత సాధించగా తాజాగా పపువా న్యూ గినియా ప్లేస్ ను ఖరారు చేసుకుంది.
మరో ఐదు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అమెరికా క్వాలిఫయర్ టోర్నీ ద్వారా ఓ బెర్తు, ఆసియా, ఆఫ్రికా క్వాలిఫయర్‌ల ద్వారా రెండేసి చొప్పున నాలుగు బెర్తులు ఖరారు కానున్నాయి.
ICC Men’s #T20WorldCup 2024 bound ✈️?
Congratulations, Papua New Guinea! ? pic.twitter.com/Y7jKSU6Hxq
— ICC (@ICC) July 28, 2023