Puneeth Rajkumar : పునీత్ సమాధి సందర్శనానికి అనుమతి

పునీత్ మరణాన్ని తట్టుకోలేని కన్నడ ప్రజలు పునీత్ సమాధికి వస్తూనే ఉన్నారు. దీంతో ఇవాళ్టి నుంచి పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి దర్శనానికి అధికారికంగా అనుమతిచ్చారు. నిన్న పునీత్‌ సమాధి

Puneeth Rajkumar : పునీత్ సమాధి సందర్శనానికి అనుమతి

Puneeth Tomb

Updated On : November 3, 2021 / 9:08 AM IST

Puneeth Rajkumar :  కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణంతో కన్నడ సినీ పరిశ్రమ మూగబోయింది. అభిమానులు ఆయన మరణాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పాటు కన్నడ ప్రజలు ఇంకా శోక సంద్రంలోనే ఉన్నారు. అంతక్రియలు ముగిశాక వారి సంప్రదాయం ప్రకారం ప్రస్తుతం పూజలు నిర్వహిస్తున్నారు కుటుంబ సభ్యులు. నిన్నటి నుంచి ఐదు రోజుల పాటు పునీత్ సమాధికి పూజలు నిర్వహించనున్నారు. ఈ పూజల్లో భాగంగా పునీత్ కి ఇష్టమైన వంటలతో పాటు 50 రకాల వంటకాలని నైవేద్యంగా సమాధి వద్ద అర్పించారు.

Puneeth Rajkumar : 50 రకాల వంటకాలతో పునీత్ రాజ్ కుమార్ కి పూజలు

పునీత్ మరణాన్ని తట్టుకోలేని కన్నడ ప్రజలు పునీత్ సమాధికి వస్తూనే ఉన్నారు. దీంతో ఇవాళ్టి నుంచి పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి దర్శనానికి అధికారికంగా అనుమతిచ్చారు. నిన్న పునీత్‌ సమాధి వద్ద కుటుంబ సభ్యుల పూజల అనంతరం పునీత్‌ అన్న శివరాజ్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ… అప్పు సమాధి దర్శనానికి బుధవారం నుంచి అభిమానులను, ప్రజలను అనుమతిస్తామని తెలిపారు. దీంతో పునీత్ సమాధిని చూడటానికి ఇవాళ్టి నుంచి అభిమానులు బారులు తీరనున్నారు.