Pregnancy at 30 years : 30 ఏళ్ల వయస్సులో గర్భం..తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు

30 ఏళ్లలో లేదా 30 దాటాక గర్భం దాల్చాలనుకుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎటువంటి నియమాలు పాటించాలి? అనే అంశంప నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండీ..

Pregnancy at 30 years : 30 ఏళ్ల వయస్సులో గర్భం..తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు

30 Years Pregnancy

Pregnancy at 30 years of age  : ఈనాటి యువత కెరీర్ డెవలప్ మెంట్ పై దృష్టి పెడుతోంది. కాలేజీ క్యాంపస్సులోనే జాబ్ కొట్టేయాలి. వెంటనే సెటిల్ అయిపోవాలి. లేదా సెటిల్ అయ్యేదాకా ఆగాలి. అప్పుడే పెళ్లి. సెటిల్ అవ్వకుండా పెళ్లి మాటే వద్దంటోంది యువత. దీంతో 30ఏళ్లు దాటుతున్నా పెళ్లిమాటే ఎత్తటంలేదు. ఇక పిల్లలు మాటే లేదు. కానీ 30 ఏళ్ల లోపు గర్భం ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. కారణాలు ఏవైనా..30ఏళ్లలోపు గర్భం ధరించకపోయినా..ఆలస్యం అయినా గర్భం దాల్చే అవకాశాలు తగ్గుతాయంటున్నారు.

జీవనశైలిలో వస్తున్న మార్పులు..తద్వారా మన శరీరంలో కలుగుతున్న మార్పలు 30 ఏళ్లు దాటితే గర్భం దాల్చటం కష్టమనేలా చేస్తున్నాయని చెబుతున్నారు. 30 ఏళ్లు దాటిన గర్భవతి అయ్యే అవకాశాలు తగ్గుముఖం పడతాయని..ఓ అధ్యయనం చెబుతోంది. మీరు గర్భధారణను వాయిదా వేయాలని ఆలోచిస్తున్న వారిలో ఉన్నట్లయితే దీని గురించి ఆలోచించాలని నిపుణులు సూచిస్తున్నారు.

గర్భం కోసం సిద్ధం కావడానికి ఏమి చేయాలి?
వయస్సుతో పాటు, జీవనశైలిలో కొంచెం మార్పు అవసరం. ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. గర్భం ధరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మద్యం సేవించడం..ధూమపానం వంటివాటికి దూరంగా ఉండాలి. చక్కటి ఫిట్ నెస్ మెయిన్ టెన్ చేయాలి. అంటే ఆరోగ్యకరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం..మీరు బిడ్డను గర్భం ధరించాలని నిర్ణయించుకున్న వెంటనే 400 mcg ఫోలిక్ యాసిడ్ కలిగిన రోజువారీ మాత్రను తీసుకోవడం ప్రారంభించాలి. ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ స్పినా బిఫిడా వంటి న్యూరల్ ట్యూబ్ అసాధారణతల సంభావ్యతను గణనీయంగా తగ్గిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

35 లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్నవారు..ఒక సంవత్సరం క్రమం తప్పకుండా సంభోగం చేసిన తర్వాత కూడా గర్భం దాల్చకపోతే వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి. గర్భం దాల్చకుండా ఏవైనా వైద్యపరమైన సమస్యలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి డాక్టర్ల కొన్ని పరీక్షలు చేస్తారు. 36 ఏళ్లు దాటిన వారు గర్భం దాల్చాలని అనుకుంటే వీలైనంత త్వరగా నిపుణులను సంప్రదించడం చాలా మంచిది. వారి సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకోవాలి.అవసరమైతే మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది.వారి వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి. నిపుణుల సూచనల్ని తప్పకుండా పాటించాలి.