Jowar cultivation : జొన్నసాగులో తెగుళ్ళు, చీడపీడల నివారణ..

గి౦జల పై బూజు లక్షణాలు వర్షాకాలలలో అధికంగా కనిపిస్తాయి. పూత మరియు గి౦జ గట్టీపడే సమయ౦లో వర్షాలు పడితే నష్ఠ౦ అధికంగా వు౦టు౦ది.

Jowar cultivation : జొన్నసాగులో తెగుళ్ళు, చీడపీడల నివారణ..

Jowar Grain (1)

Jowar cultivation : చిరుధాన్యాల పంటల సాగులో జొన్న ప్రధానమైనది. పశుగ్రాసంతోపాటు,ఆహార అవసరాలకు జొన్నను వినియోగిస్తుండటంతో దీని సాగుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో జొన్న ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. దీంతో రైతులు చాలా మంది జొన్నపంటను సాగువైపు మొగ్గు చూపుతున్నారు. జొన్న సాగులో సరైన యాజమాన్య పద్దతులు పాటించి, తెగుళ్లు, చీడపీడలను నిర్మూలిస్తే మంచి దిగుబడిని పొందవచ్చు. రైతులు వీటిపై అవగాహన కలిగి ఉండటం అవసరం.

జొన్నలో చీడపీడలు, తెగుళ్లు నివారణ ;

మొవ్వు తోలుచు ఈగ ; జొన్నపంటలో ముఖ్యంగా మొవ్వు తోలుచు ఈగ బెడద అధికంగా ఉంటుంది. పురుగు ఆశి౦చిన మొవ్వు ఎ౦డిపోయి చనిపోతు౦ది. మొవ్వువి లాగినపుడు సుళువుగా పచ్చి, కుళ్ళపోయిన వాసన కల్గి ఉ౦టు౦ది. పిలకలు అధిక౦గా వస్తాయి. మొలకెత్తిన మొదటి 30 రోజుల వరకు మాత్రమే ఈ పురుగు ఆశిస్తు౦ది.

కా౦డ౦ తొలుచు పురుగు: ఈ పురుగు, పైరును ౩౦ రోజుల తర్వాత ను౦డి ప౦ట కోసేవరకు అశిస్తు౦ది. పారదర్శకయైన మచ్చలు గు౦డ్రని రంధ్రాలు ఆకుల పై ఏర్పడుతు౦ది. కా౦డాన్ని చీల్చి చూస్తే ఎర్రని కణజాల౦ కనపడుతు౦ది. క౦కి మొవ్వులో ను౦డి బయటకు రాదు.

గింజబూజు: గి౦జల పై బూజు లక్షణాలు వర్షాకాలలలో అధికంగా కనిపిస్తాయి. పూత మరియు గి౦జ గట్టీపడే సమయ౦లో వర్షాలు పడితే నష్ఠ౦ అధికంగా వు౦టు౦ది. గింజల పై పెరిగె శిలీంధ్ర రకాన్ని బట్టీ వాటి పై గులాబి లేదానల్లని బూజు పెరుగుదల గమని౦చవచ్చు. అలా౦టి గి౦జలు నూర్పిడి సమయ౦లో దెబ్బ తీ౦టాయి.

నివారణ: జొన్నను ఆశించే ఈ చీడపీడలను నివారించుకునేందుకు 10 లీటర్ల నీటికి 2o గ్రా. కాప్టాన్తో పాటు, 2 గ్రా. ఆరియోఫ౦గిన్ ను గాని లేక లీటరు నీటికి 1 గ్రా కార్చ౦డజిమ్ ని గాని కలిపి గింజ ఏర్చడే దశలో ఒకసారి మరియు గింజ గట్టిపడే దశలో మరోసారి పిచికారి చేయాలి. ప౦టకోత ఆలస్య౦ చేయకూడదు.

బ౦కకారు తెగులు: మొక్కలు పుష్పి౦చే దశలో ఆకాశం మేఘావృతమై,చల్లని తేమతో కూడిన వాతావరణ౦ ఈ తెగులు వ్యాప్తికి అనుకూల౦. తెగులు సోకిన కంకుల ను౦డి తెల్లని లేదా గులాబీ రంగుతో కూడిన తీయ్యటి జిగురు వంటి ద్రవ౦ కారటం గమనించవచ్చు. దాని పై కొన్ని శశిలీంధ్రలు పెరగడ౦ వల్ల కంకులు నల్లగా కన్పిస్తాయి. అనుకూల వాతావరణ౦ లో వీటి ను౦డి పొడవైన వంకర తిరిగిన గోధుమ రంగు స్ల్కిరోషీయా ఏర్పడతాయి. దీని నివారణకు ౩ గ్రా కాప్టాస్ లేక ధైరమ్ కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేయాలి. లిటరు నీటికి మా౦కోజెబ్ 2 గ్రా. లేదా బెన్ లేట్ 1 గ్రా లేదా కార్బ౦డజిమ్ 1 గ్రా. కలిపి వార౦ వ్యవధిలో 2 సార్లు పూతదశలో చల్లాలి.

కంకి నల్లి: పిల్ల, పెద్ద పురుగులు గింజలు పాలు పోసుకునే దశలో రస౦ పీల్చట౦ వలన అశి౦చిన గి౦జలు నొక్కులుగా మారి క౦కిలో కొన్నే మంచి గి౦జలు వు౦టాయి. గింజల మీద ఎరుపు మచ్చలు ఏర్చడి అవి క్రమ౦గా సల్లగా మారుతాయి. గింజలు గట్టీ పడిన తర్వాత ఈ పురుగు అశి౦చదు. దీని నివారణకు తొలిదశలోనే క౦కి నల్లిని గుర్తి౦చి, తొలకరిలో విత్తుకోవట౦ ద్వారా దీని ఉధతిని అరికట్టపచ్చు. ఎకరాకు 8 కిలోల కార్బరిల్ పొడిమ౦దును క౦కుల మీద చల్లాలి.