బికినీలో రచ్చ చేస్తున్న రాశీ ఖన్నా

బికినీలో రచ్చ చేస్తున్న రాశీ ఖన్నా

Raashi Khanna: మారుతున్న కాలంతో పాటు మనమూ మారాలి అన్న చందాన టాలీవుడ్ హాట్ బ్యూటీ రాశీ ఖన్నా ఇప్పుడు గ్లామర్ డోస్ పెంచేసింది. ఇప్పటివరకు ఓ మోస్తరుగా అందాలు ఆరబోసిన ఈ ఢిల్లో బ్యూటీ ఫస్ట్ టైమ్ బికినీలో కనిపించి సర్‌ప్రైజ్‌తో కూడిన షాకిచ్చింది.

ఇంతకుముందు రాశీ రూపం ఎలా ఉండేదో గుర్తుందా.. బొద్దుగా ఉండేది.. సినిమా అనేది గ్లామర్ ఫీల్డ్.. ఇక్కడ హీరోయిన్లకు ఫిజిక్ అనేది చాలా ఇంపార్టెంట్.. అందుకే యంగ్ హీరోయిన్లతో పాటు సీనియర్ నటీమణులు కూడా ఫిట్‌నెస్ మెయింటైన్ చేస్తుంటారు. శరీరాకృతిపై ఫోకస్ పెట్టి రాశీ ఇప్పుడు కొత్త అవతార్‌లోకి మారిపోయింది.

ఇక ఏదైనా ధరించి స్లిమ్ ఫిజిక్ తన సొంతమవ్వడంతో బికినీలో పూల్ దగ్గర హొయలొలికిస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. రాశీ ఫ్రెండ్స్‌తో కలిసి గోవా టూర్ వేసింది. అక్కడి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఇప్పుడు మీరు చూస్తున్న ఫిజిక్‌లోకి మారడానికి చాలా కష్టపడ్డానని చెప్పుకొచ్చింది.

తన ట్రైనర్ సాయంతోనే ఇలా మారగలిగానని, అతను తన కోసం ప్రత్యేకమైన ఎక్సర్‌సైజులతో పాటు, స్పెషల్ డైట్ కూడా ప్లాన్ చేశాడని, ఏడాది పాటు శాఖాహారం మాత్రమే తీసుకుని నేను అనుకున్న ఫిజిక్ సాధించగలిగానని చెప్పుకొచ్చిందీ 30 ఏళ్ల ముద్దుగుమ్మ. హిందీలో ఓ పాపులర్ ఓటీటీ సిరీస్ కోసం రాశీ ఖన్నా, షాహిద్ కపూర్‌తో కలిసి నటించనుంది.