2024 Maruti Suzuki Swift : 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో మారుతి స్విఫ్ట్ కారు వచ్చేస్తోంది.. ఈ నెల 9నే లాంచ్.. బుకింగ్స్ ఓపెన్..!

మారుతి సుజుకి స్విఫ్ట్ 2005లో భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటివరకు దేశీయ విపణిలో దాదాపు 3 మిలియన్ యూనిట్లను విక్రయించింది.

2024 Maruti Suzuki Swift : 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో మారుతి స్విఫ్ట్ కారు వచ్చేస్తోంది.. ఈ నెల 9నే లాంచ్.. బుకింగ్స్ ఓపెన్..!

2024 Maruti Suzuki Swift ( Image Credit : Google )

2024 Maruti Suzuki Swift : ప్రముఖ మారుతి సుజుకి ఇండియా రాబోయే నాల్గవ జనరేషన్ మారుతి సుజుకి స్విఫ్ట్ కారు రూ. 11వేల టోకెన్ మొత్తానికి బుకింగ్‌లను ప్రారంభించింది. ఈ కారు మే 9న దేశ మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ కొత్త కారు ప్రామాణికంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తుందని భావిస్తున్నారు. మారుతి సుజుకి స్విఫ్ట్ 2005లో భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటివరకు దేశీయ విపణిలో దాదాపు 3 మిలియన్ యూనిట్లను విక్రయించింది.

Read Also : WhatsApp Pin Chats : వాట్సాప్ యూజర్లు ఇకపై 3 మెసేజ్‌ల వరకు పిన్ చేయొచ్చు.. ఇదిగో ఇలా!

ఈ కారు అనేక అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఎగుమతి అయింది. నివేదికల ప్రకారం.. కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ 2024 ప్రామాణికంగా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తుంది. ఇప్పటికే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD)తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), బ్రేక్ అసిస్ట్ (BA) వంటి ఇతర సెక్యూరిటీ ఫీచర్లను ప్రామాణికంగా కలిగి ఉంది.

అత్యధికంగా అమ్ముడైన కారుగా టాటా పంచ్ :
మారుతి సుజుకి స్విఫ్ట్ (FY24)లో 195,321 యూనిట్ల అమ్మకాలను సాధించింది. టాటా పంచ్ ఈ ఆర్థిక సంవత్సరంలో 170,076 యూనిట్ల వాల్యూమ్‌లతో మారుతి హ్యాచ్‌బ్యాక్‌లను విక్రయించింది. టాటా పంచ్ మార్చి 2024లో భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన కారుగా అవతరించింది. జూలై 2023లో ప్రారంభమైన హ్యుందాయ్ ఎక్స్‌టర్ కూడా 71,299 యూనిట్ల మంచి విక్రయాలను నమోదు చేయగా, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ 70,764 యూనిట్లను సాధించింది.

హ్యుందాయ్ కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్స్ :
మారుతి సుజుకి స్విఫ్ట్ సెక్యూరిటీ రేటింగ్‌ గురించి చెప్పాలంటే.. గ్లోబల్ ఎన్‌సీఎపీలో ఈ కారు పేలవమైన పనితీరును కనబరిచింది. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ కేటగిరీలలో ఒక్కో స్టార్ మాత్రమే ఉంది. టాటా పంచ్ ఫైవ్ స్టార్ సేఫ్టీ-రేటెడ్ కారు. హ్యుందాయ్ ఎక్స్‌టర్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ విషయానికి వస్తే.. రెండూ ప్రామాణికంగా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంటాయి. అంతేకాదు. భారత్‌లో అన్ని హ్యుందాయ్ కార్లు ఇప్పుడు ప్రామాణికంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తున్నాయి.

ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌సీ, ఈబీడీతో కూడిన ఏబీఎస్, బీఏ వంటి సెక్యూరిటీ ఫీచర్లతో 2024 మారుతి సుజుకి స్విఫ్ట్ రానుంది. భారత్ (NCAP)లో టెస్టింగ్ ద్వారా సెక్యూరిటీ రేటింగ్‌లను కలిగి ఉండనుంది. కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ 2024 ఎక్స్‌ట్రనల్, ఇంటర్నల్ అప్‌డేట్స్‌తో వస్తుంది. కొత్త గ్రిల్, కొత్త ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, కొత్త ఎల్‌ఈడీ టెయిల్‌ల్యాంప్‌లు, కొత్త అల్లాయ్ వీల్స్‌తో రీడిజైన్ చేసిన ఫ్రంట్‌ను కలిగి ఉంటుంది. క్యాబిన్ లోపల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, క్లైమేట్ కంట్రోల్ యూనిట్ కొత్తగా ఉంటాయి. 360-డిగ్రీ కెమెరా కూడా ఉంటుంది.

Read Also : Amazon Summer Sale 2024 : మరో 24 గంటల్లో అమెజాన్ సమ్మర్ సేల్ 2024.. ఈ టాప్ 7 బెస్ట్ 5జీ ఫోన్ డీల్స్ మీకోసం..!