Venkatesh Daggubati : ఎన్నికల ప్రచారంలో సినీ గ్లామర్.. వియ్యంకుడి కోసం హీరో వెంకటేశ్ ప్రచారం

సినీ హీరో వెంకటేశ్‌ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. రాజకీయాలకు దూరంగా ఉండే వెంకటేష్ ఈసారి కాంగ్రెస్ పార్టీ తరుఫున  ప్రచారం చేయడానికి సిద్ధమవడం ఆసక్తికరంగా మారింది..

Venkatesh Daggubati : ఎన్నికల ప్రచారంలో సినీ గ్లామర్.. వియ్యంకుడి కోసం హీరో వెంకటేశ్ ప్రచారం

Venkatesh Daggubati

Venkatesh Daggubati : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం అంటే.. సినీ గ్లామర్ కామనే. ఎన్టీఆర్ టైమ్‌ నుంచి ఇప్పటివరకు ప్రతీ ఎలక్షన్‌లో రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు మద్దతుగా సినీ నటులు ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో కూడా ఏపీలో వైసీపీ, జనసేన, టీడీపీ తరఫున.. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున సినీ నటులు ప్రచారం చేస్తున్నారు.

సినీ హీరో వెంకటేశ్‌ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. రాజకీయాలకు దూరంగా ఉండే వెంకటేష్ ఈసారి కాంగ్రెస్ పార్టీ తరుఫున  ప్రచారం చేయడానికి సిద్ధమవడం ఆసక్తికరంగా మారింది.. దగ్గుబాటి ఫ్యామిలీ పక్కా తెలుగుదేశం పార్టీ ఫేవర్‌. అయినా ఆయన ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రచారం చేయనున్నారు.

Read Also : Kcr : కేసీఆర్‌కు ఈసీ బిగ్ షాక్.. ఎన్నికల ప్రచారంపై నిషేధం

ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామసహాయం రఘురాంరెడ్డికి మద్దతుగా ప్రచారం చేయనున్నారు వెంకటేశ్‌. మే 7న ఖమ్మం పట్టణం, లోక్‌సభ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రామసహాయం రఘురాంరెడ్డి, వెంకటేశ్‌కు వియ్యంకుడు. రఘురాంరెడ్డి పెద్ద కుమారుడికి వెంకటేశ్‌ కూతురును ఇచ్చి పెళ్లి చేశారు. అలాగే రఘురాంరెడ్డి రెండో కుమారుడికి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చిన్నకుమార్తెను ఇచ్చారు. అలా రఘురాంరెడ్డి, వెంకటేశ్‌, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి బంధుత్వం కలిసింది.

బంధుత్వం కారణంగానే వెంకటేశ్‌ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో ఉన్న రఘురాంరెడ్డికి మద్దతు తెలిపారు. ఆయన విజయానికి ప్రచారం చేయనున్నారు. ఇక హైదరాబాద్ రేస్ కోర్స్ చైర్మన్‌గా ఉన్న రామసహాయం సురేందర్ రెడ్డి చాలాకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి కారణంగా మళ్లీ తన వారసుడిగా రఘురాంరెడ్డిని బరిలోకి దించారు. సినీ, రాజకీయ రంగంలో దగ్గుబాటి ఫ్యామిలీకి మంచి గుర్తింపు ఉంది. సినీ నిర్మాతగా రామానాయుడుకు ఫిలిం ఇండస్ట్రీలో ఓ హిస్టరీ ఉంది.

తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన ఎంపీగా కూడా సేవలు అందించారు. 1999 నుంచి 2004 వరకు బాపట్ల ఎంపీగా కొనసాగారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు రామానాయుడు. అప్పటి నుంచి దగ్గుబాటి ఫ్యామిలీ రాజకీయాలకు దూరంగా ఉంటుంది. మరోవైపు ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోసం సినీ హీరో తొట్టెంపూడి వేణు ప్రచారం చేయనున్నారు. నామా నాగేశ్వరరావుకు తొట్టెంపూడి వేణు స్వయాన బామ్మర్ది. గత ఎన్నికల్లో కూడా నామా గెలుపు కోసం ప్రచారం చేశాడు వేణు.

Read Also : Kcr On Ec Ban : ఈసీ నిషేధంపై స్పందించిన కేసీఆర్.. హాట్ కామెంట్స్