నేను రోమియో టైపు కాదు.. ‘రాధే శ్యామ్’ గ్లింప్స్ చూశారా!

నేను రోమియో టైపు కాదు.. ‘రాధే శ్యామ్’ గ్లింప్స్ చూశారా!

Radhe Shyam Glimpse: డార్లింగ్, రెబల్ స్టార్ ప్రభాస్, హాట్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా.. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో గోపికృష్ణా మూవీస్ ప్రై.లి. ‘రెబల్ స్టార్’ డా.యు.వి.కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ సంస్థలు నిర్మస్తున్న ప్రెస్టీజియస్ ఫిలిం.. ‘రాధే శ్యామ్’..

రోమ్ బ్యాక్ డ్రాప్‌లో రెట్రో లవ్ స్టోరీగా రూపొందుతున్న ‘రాధే శ్యామ్’ గ్లింప్స్ వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేశారు.. విక్రమాదిత్య రైల్వే ఫ్లాట్‌ఫామ్ మీద జనసందోహం మధ్యలో ఉన్న ప్రేయసికి విదేశీ భాషలో లవ్ ప్రపోజ్ చెయ్యగా.. ప్రేరణ.. ‘నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా’.. అంటే.. విక్రమాదిత్య.. ‘ఛ, వాడు ప్రేమకోసం చచ్చాడు.. నేను ఆ టైప్ కాదు’.. అంటూ ప్రభాస్ తన ప్రేమని తెలియజేసే గ్లింప్స్ ఆసక్తికరంగా ఉంది.

సీనియర్ బాలీవుడ్ నటి భాగ్యశ్రీ, మురళీ శర్మ, సచిన్ ఖేద్‌కర్, ప్రియదర్శి, సాషా చెట్రి తదితరులు నటిస్తున్న ‘రాధే శ్యామ్’ జూలై 30న తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది.