Raja Singh: నడిరోడ్డుపై ఆగిపోయిన రాజాసింగ్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం.. అసంతృప్తి వ్యక్తం చేసిన రాజా సింగ్

తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరచూ ఆగిపోతుండటంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అసహనం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులు ముప్పు ఉన్న తనకు ఇలాంటి వాహనం కేటాయిస్తారా అని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

Raja Singh: నడిరోడ్డుపై ఆగిపోయిన రాజాసింగ్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం.. అసంతృప్తి వ్యక్తం చేసిన రాజా సింగ్

Raja Singh: తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరచూ ఆగిపోతుండటంపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సోమవారం అఫ్జల్ గంజ్ మీదుగా బుల్లెట్ ప్రూఫ్ కారులో వెళ్తుండగా మధ్యలో మొరాయించింది.

Sweety weds Sheru: స్వీటీ పెళ్లి షేరూతో.. సంప్రదాయబద్ధంగా పెంపుడు కుక్కల పెళ్లి

దీంతో ఆయన తన కారును మధ్యలోనే వదిలేసి నడుచుకుంటూ వెళ్లారు. అక్కడి నుంచి మరో వాహనంలో ఇంటికి చేరుకున్నారు. అయితే, తన బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇలా తరచూ ఆగిపోతుండటంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ‘‘కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో తెలంగాణ అధికారులు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించారు. అయితే, నాలుగు నెలల క్రితం రోడ్డు మధ్యలో వాహనం ఆగిపోతే తిరిగి తెలంగాణ ఇంటెలిజెన్స్ కార్యాలయానికి పంపించాను. వాళ్లు మరమ్మతులు చేసి తిరిగి అదే వాహనాన్ని ఇచ్చారు.

CM Bommai: పాఠశాలలకు కాషాయ రంగు వేస్తే తప్పేంటి.. ప్రతిపక్షాల్ని ప్రశ్నించిన కర్ణాటక సీఎం బొమ్మై

తర్వాత రెండు నెలల క్రితం కూడా నాంపల్లి కోర్టుకు వెళ్లేటప్పుడు వాహనం అలాగే ఆగిపోయింది. ఆ సమయంలో గన్‌మెన్ల సాయంతో ఆటోలో కోర్టుకు వెళ్లాను. ఇప్పుడు మరోసారి అఫ్జల్‌గంజ్ వద్ద మరోసారి ఆగిపోయింది. ఇలా ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్న నాకు అధికారులు ఇలాంటి వాహనం కేటాయించడం సరైందేనా’’ అంటూ రాజా సింగ్ అసహనం వ్యక్తం చేశారు.