Rakul Preet Singh : పాన్ ఇండియా అనే పదం ఒక కమర్షియల్ కోణం మాత్రమే..

పాన్ ఇండియా ట్యాగ్ పై రకుల్ ప్రీత్ మాట్లాడుతూ.. ఉన్నది ఒక్కటే ఇండియా. ఇండియా అంటే ఇండియా అంతే. కరోనా తర్వాత ఓటీటీకి ఆదరణ పెరిగింది. దీంతో ప్రేక్షకులు అన్ని భాషల సినిమాలు చూస్తున్నారు. కొరియన్ సిరీస్ లు కూడా................

Rakul Preet Singh : పాన్ ఇండియా అనే పదం ఒక కమర్షియల్ కోణం మాత్రమే..

Rakul Preet Singh interesting comments on Pan India word

Rakul Preet Singh :  హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వరుసగా తెలుగులో స్టార్ హీరోయిన్ గా సినిమాలు చేస్తున్నప్పుడే బాలీవుడ్ లో ఆఫర్ రావడంతో అక్కడికి చెక్కేసింది. అక్కడే వరుస సినిమాలు ఆఫర్స్ వస్తుండటంతో బాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది రకుల్ ప్రీత్ సింగ్. బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ తో ప్రేమలో పడి లైఫ్ కూడా సెటిల్ చేసేసుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ లో జయాపజయాలు సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తుంది.

రకుల్ ప్రీత్ సింగ్ మెయిన్ లీడ్ లో నటించిన ఛత్రివాలి సినిమా జీ5 ఓటీటీలో జనవరి 20న రిలీజ్ అయింది. గత కొన్ని రోజులుగా రకుల్ ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పాన్ ఇండియా సినిమాలు అనేదానిపై రకుల్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Surya Narayana : ప్రముఖ సీనియర్ నిర్మాత మృతి.. ఎన్టీఆర్ కి ‘అడవి రాముడు’ హిట్ ఇచ్చిన ప్రొడ్యూసర్..

పాన్ ఇండియా ట్యాగ్ పై రకుల్ ప్రీత్ మాట్లాడుతూ.. ఉన్నది ఒక్కటే ఇండియా. ఇండియా అంటే ఇండియా అంతే. కరోనా తర్వాత ఓటీటీకి ఆదరణ పెరిగింది. దీంతో ప్రేక్షకులు అన్ని భాషల సినిమాలు చూస్తున్నారు. కొరియన్ సిరీస్ లు కూడా చూస్తున్నారు. మన రీజనల్ సినిమాలు కూడా జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా అలరిస్తున్నాయి. కొంతమంది పాన్ ఇండియా అనే పదం ఉంటే పెద్ద సినిమాగా భావిస్తున్నారు. ఆ ట్యాగ్ ఉంటే దేశంలోని అన్ని భాషల ప్రజలు వస్తారని అనుకుంటున్నారు. పాన్ ఇండియా అనే పదం ఒక కమర్షియల్ కోణం మాత్రమే. సినిమాకి జనాల్ని రప్పించడానికి ఆ పదాన్ని వాడుతున్నారు. సినిమాలో భాష కంటే కూడా ఎమోషన్ ముఖ్యం అని నేను నమ్ముతాను. ఒక నటిగా ఏ భాషలోనైనా సినిమాలు చేస్తాను అని తెలిపింది. దీంతో రకుల్ చేసిన ఈ పాన్ ఇండియా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.