Rashi Khanna : ప్రభాస్ సినిమాలో రాశి ఖన్నా..!

క్యూట్‌గా ఉండే రాశీ ఖన్నా.. తెలుగులో సినిమాలు స్టార్ట్ చేసి చాలా కాలం అయినా స్టార్ స్టేటస్ రాకుండానే కెరీర్ స్లో అయ్యింది..

Rashi Khanna : ప్రభాస్ సినిమాలో రాశి ఖన్నా..!

Rashi Khanna

Rashi Khanna: పెద్దగా పర్ఫామెన్స్ చూపించాల్సిన పని లేకుండానే సినిమాలు చేసేసిన క్యూట్ హీరోయిన్ రాశీ ఖన్నా.. ఆ తర్వాత ‘వరల్డ్ ఫేమస్ లవర్’ తో చేసిన గ్లామర్ షో మిస్ ఫైర్ అవ్వడంతో సడెన్‌గా ఫేడవుట్ అయిపోయింది. అయితే చిన్న గ్యాప్ తర్వాత మళ్లీ చేతినిండా సినిమాలతో ఫుల్ స్వింగ్‌లోఉంది రాశీ కెరీర్. అంతేకాదు ఏకంగా ప్రభాస్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ.

క్యూట్‌గా ఉండే రాశీ ఖన్నా.. తెలుగులో సినిమాలు స్టార్ట్ చేసి చాలా కాలం అయినా స్టార్ స్టేటస్ మాత్రం రాకుండానే కెరీర్ స్లో అయ్యింది. అందరూ యంగ్ హీరోలతో సినిమాలు చేసినా రాశీకి, కొత్తహీరోయిన్స్ రావడంతో అవకాశాలు తగ్గాయి. కానీ ఇప్పుడు కాస్త గ్యాప్ తీసుకుని మళ్లీ వరుసగా ఆఫర్లతో బిజీ అయ్యింది ఈ బెల్లం శ్రీదేవి.

రాశీ ఖన్నా ప్రస్తుతం వెబ్ సిరీస్‌లతో పాటు వరుసగా సౌత్‌లో సినిమాలతో బిజీ అయ్యింది. సౌత్‌లో, ముఖ్యంగా తెలుగులో నాగ చైతన్య, విక్రమ్ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘థాంక్యూ’ సినిమాతో పాటు గోపీచంద్- మారుతి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘పక్కా కమర్షియల్’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

తెలుగులో సినిమాలతో పాటు తమిళ్‌లో కూడా మూడు సినిమాలు చేస్తోంది. వీటితో పాటు ఓటీటీల్లో కూడాబిజీ అవుతోంది. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గణ్ నటిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ సిరీస్ ‘రుద్ర’ సిరీస్‌లో రాశీ నటిస్తోంది. వీటితో పాటు ఇప్పటికే ‘ఫ్యామిలీ మ్యాన్’ తీసిన డికె.రాజ్ డైరెక్షన్లో షాహిద్ కపూర్ చేస్తున్న వెబ్ సిరీస్‌లో మరో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది రాశీ ఖన్నా.. ఇలా ఒకప్పుడు కెరీర్ క్లోజ్ అనుకున్న రాశి ఖన్నా, ఫుల్ బిజీగా బౌన్స్ బ్యాక్ అవుతోంది.