Spider-Man: No Way Home: రికార్డులు తిరగరాస్తున్న స్పైడర్ మ్యాన్.. అవతార్‌ని ఓవర్ టేక్?

హాలీవుడ్ రికార్డులు తిరగరాస్తున్నాడు స్పైడర్ మ్యాన్. వందల కోట్లుకాదు.. వేలకోట్ల కలెక్షన్లతో ప్రపంచాన్ని సర్ ప్రైజ్ చేస్తున్నాడు ఈ సూపర్ హీరో. అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా..

Spider-Man: No Way Home: రికార్డులు తిరగరాస్తున్న స్పైడర్ మ్యాన్.. అవతార్‌ని ఓవర్ టేక్?

Spider Man

Spider-Man: No Way Home: హాలీవుడ్ రికార్డులు తిరగరాస్తున్నాడు స్పైడర్ మ్యాన్. వందల కోట్లుకాదు.. వేలకోట్ల కలెక్షన్లతో ప్రపంచాన్ని సర్ ప్రైజ్ చేస్తున్నాడు ఈ సూపర్ హీరో. అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా రిలీజ్ అయిన ప్రతి చోటా రికార్డ్ కలెక్షన్లతో.. దూసుకుపోతోంది. లేటెస్ట్ గా ప్రపంచలోనే టాప్ గ్రాసింగ్ మూవీ అయిన అవతార్ ని బీట్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చెయ్యడానికి రెడీ అవుతున్నాడు స్పైడర్ మ్యాన్.

Pooja Hegde: ఐదు సినిమాలు రిలీజ్.. ఈ ఇయర్ తనదే అంటున్న బుట్టబొమ్మ!

8 వారాల క్రితం హాలీవుడ్ మూవీ స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ రిలీజ్ అయ్యిందో లేదో.. సూపర్ కలెక్షన్లతో రికార్డ్ క్రియేట్ చేస్తున్నాడు. డిసెంబర్ 16న రిలీజ్ అయిన స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ మూవీ 2021 సంవత్సరానికి హయ్యస్ట్ గ్రాసర్ గా 10 వేలకు పైగా కలెక్ట్ చేసి వరల్డ్ వైడ్ గా సరికొత్త ట్రెండ్ సెట్ చేశాడు. అంతేకాదు ఇప్పుడు వరల్డ్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచిన అవతార్ సినిమాని ఓవర్ టేక్ చెయ్యబోతున్నాడు.

Pushpa 2: టీమ్ వర్క్ మొదలు పెట్టిన పుష్పరాజ్.. అనుకున్నట్లే రిలీజ్!

స్పైడర్ మ్యాన్ మూవీ రిలీజ్ అయిన 12 రోజుల్లోనే అక్షరాలా 1 బిలియన్.. కలెక్షన్లు సాధించి లేటెస్ట్ గా నార్త్ అమెరికన్ బాక్సాఫీస్ దగ్గర 5 వేల 5 వందల 95 కోట్ల కుపైగా కలెక్ట్ చేసింది. అయితే అవతార్ 5 వేల 6వందల 78 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఈ కలెక్షన్లలో అవతార్ రీ రిలీజ్ కలెక్షన్లు కూడా యాడ్ అయ్యాయి. రీ రిలీజ్ కలెక్షన్లు యాడ్ చెయ్యకుండా ఉంటే.. అవతార్ కలెక్షన్లు 5 వేల 5వందల 99కోట్లు. ఈ లెక్కన నార్త్ అమెరికాలో అవతార్ కలెక్షన్లు బీట్ చెయ్యడానికి పెద్ద టైమ్ పట్టదంటున్నారు ఫాన్స్.

Radhe Shyam: థీమ్ పార్టీ.. క్యూరియాసిటీ తెగ పెంచేస్తున్న సరికొత్త ప్రమోషన్!

కొవిడ్ టైమ్ ని కూడా లెక్కచేయకుండా దూసుకెళ్లాడు స్పైడర్ మ్యాన్. వరల్డ్ వైడ్ గా దాదాపు 15 వేల కోట్ల కలెక్షన్స్ రాబట్టింది స్పైడర్ మ్యాన్ – నో వే హోమ్. అయితే ఇంతవరకు ఆల్రెడీ రికార్డ్ సెట్ చేసిన టాప్ 5 సినిమాలను క్రాస్ చేయలేదు. ఒక్క ఇండియాలోనే దాదాపు 260 కోట్లు కలెక్ట్ చేసిన స్పైడర్ మ్యాన్.. ఇప్పుడు అవతార్ ని ఓవర్ టేక్ చెయ్యబోతోంది. ప్రపంచంలోనే హైయ్యెస్ట్ గ్రాసింగ్ రికార్డ్ ఇప్పటికీ అవతార్ దే. 2009లో రిలీజై బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిన ఈ సినిమా కలెక్షన్లను ఇప్పటి వరకూ ఏ సినిమా క్రాస్ చెయ్యలేకపోయింది.

Aishwarya Rai: లతా మంగేష్కర్ కి ఐష్ నివాళి.. నెటిజన్ల ట్రోల్స్!

అవతార్ వసూళ్లు 20 వేల 368 కోట్లు. ఇన్ని వేల కోట్లు వసూలు చేసిన మరో సినిమా ఇంతవరకు రిలీజ్ కాలేదు. ఇంత లాభాన్ని తెచ్చిపెట్టింది కాబట్టే 1900 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘అవతార్ 2’ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ‘అవతార్ 2’2022 డిసెంబర్ 16న రిలీజ్ కానుంది. వరుసగా రెండేళ్ల గ్యాప్‌తో అవతార్ 3, 4, 5 రాబోతున్నాయి. ఇలాంటి టాప్ గ్రాసింగ్ మూవీ కలెక్షన్లనే క్రాస్ చేసే రేంజ్ కి వెళ్లాడు స్పైడర్ మ్యాన్.