Service charge: హోటల్స్, రెస్టారెంట్లకు షాక్.. సర్వీస్ ఛార్జ్‌లపై నిషేదం

హోటల్స్, రెస్టారెంట్లు ఫుడ్ బిల్‌లో బలవంతంగా సర్వీస్ ఛార్జ్ విధించడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ హోటల్స్, రెస్టారెంట్లు బిల్లుల్లో సర్వీస్ ఛార్జ్ ను విధించొద్దని నిషేదాఙలు జారీ చేసింది. రెస్టారెంట్లు బలవంతంగా టిప్ లు వసూలు చేస్తున్న క్రమంలో నమోదవుతున్న ఫిర్యాదుల మేరకు ఈ గైడ్ లైన్స్ ఇష్యూ చేశారు.

Service charge: హోటల్స్, రెస్టారెంట్లకు షాక్.. సర్వీస్ ఛార్జ్‌లపై నిషేదం

Restaurants

 

Service charge: హోటల్స్, రెస్టారెంట్లు ఫుడ్ బిల్‌లో బలవంతంగా సర్వీస్ ఛార్జ్ విధించడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ హోటల్స్, రెస్టారెంట్లు బిల్లుల్లో సర్వీస్ ఛార్జ్ ను విధించొద్దని నిషేదాఙలు జారీ చేసింది. రెస్టారెంట్లు బలవంతంగా టిప్ లు వసూలు చేస్తున్న క్రమంలో నమోదవుతున్న ఫిర్యాదుల మేరకు ఈ గైడ్ లైన్స్ ఇష్యూ చేశారు.

గతంలో కన్జూమర్ ఎఫైర్స్ మినిస్ట్రీ రెస్టారెంట్లు, హోటల్స్ సర్వీస్ ఛార్జ్ విధించొద్దని చెప్తే.. క్లియర్ గైడ్ లైన్స్ లేవని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సమాధానమిచ్చింది. గవర్నమెంట్ లీగల్ గా చెప్పంతేవరకూ సర్వీస్ ఛార్జీలు తప్పక ఉంటాయని చెప్పింది.

లేటెస్ట్ గైడ్ లైన్స్ కు అనుగుణంగా.. రెస్టారెంట్లలో, హోటల్స్ లో సర్వీస్ ఛార్జ్ విధిస్తే.. నేషనల్ కన్జూమర్ హెల్ప్ లైన్ కు కంప్లైంట్ చేయొచ్చు. దాని కోసం e-daakhil పోర్టల్ లో కంప్లైంట్ చేసి వేగవంతమైన పరిష్కారం పొందొచ్చు.

Read Also: సర్వీసు ఛార్జీల వసూలు.. రెస్టారెంట్లకు కేంద్రం వార్నింగ్

ప్రస్తుత గైడ్ లైన్స్ ప్రకారం.. హోటల్స్ లేదా రెస్టారెంట్లు సర్వీస్ ఛార్జ్ ఆటోమేటిక్ గా యాడ్ చేయడానికి వీల్లేదు. లేదా ఏ ఇతర పేరు మీద కూడా దానిని వసూలు చేయకూడదు. సర్వీస్‌ చార్జీల విషయంలో వినియోగదారుల హక్కుల ఉల్లంఘన, అనుచిత వ్యాపార విధానాలను అరికట్టేందుకు సీసీపీఏ సోమవారం ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది.